News April 17, 2024
రేషన్ కార్డుదారులకు అలర్ట్

TG: పథకాలు అందించడంలో భాగంగా ప్రభుత్వం రేషన్ కార్డులకు e-KYCని తప్పనిసరి చేసింది. ఇప్పటికే FEB 29తో గడువు ముగియగా మరోసారి పొడిగించింది. మొత్తం లబ్ధిదారుల్లో ఇప్పటివరకు 74% మందే KYC నమోదు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో దగ్గరలోని రేషన్ దుకాణాలకు వెళ్లి త్వరగా ఈ-కేవైసీ చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుతానికి గడువు తేదీ ప్రకటించనప్పటికీ.. మరోసారి గడువు పొడిగించే అవకాశం ఉండకపోవచ్చంటున్నారు.
Similar News
News October 18, 2025
అఫ్గాన్లు పాక్ నుంచి వెళ్లిపోవాలి: ఖవాజా ఆసిఫ్

అఫ్గానిస్థాన్తో ఘర్షణల నేపథ్యంలో పాకిస్థాన్ డిఫెన్స్ మినిస్టర్ అఫ్గాన్లు దేశం విడిచిపోవాలని సూచించారు. ‘ఈ దేశం, సౌకర్యాలు కేవలం 25 కోట్ల పాక్ పౌరులకే సొంతం. ఇక్కడ ఉంటున్న అఫ్గాన్ పౌరులు తిరిగి మీ దేశానికి వెళ్లిపోవాలి. మీకు ఇప్పుడు ప్రత్యేక ప్రభుత్వం ఉంది’ అని తెలిపారు. అంతకంటే ముందు సరిహద్దు ఉద్రిక్తతల విషయంలో అవసరమైతే అఫ్గాన్, భారత్తో యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
News October 18, 2025
కోడి పిల్లల పెంపకం – బ్రూడింగ్ కీలకం

కోడి పిల్లలు గుడ్డు నుంచి బయటకొచ్చాక కృత్రిమంగా వేడిని అందించడాన్ని “బ్రూడింగ్” అంటారు. వాతావరణ పరిస్థితులను బట్టి బ్రూడింగ్ను 4-6 వారాల పాటు చేపట్టాల్సి ఉంటుంది. అయితే బ్రూడర్ కింద వేడిని కోడి పిల్లల వయసును బట్టి క్రమంగా తగ్గించాలి. బ్రూడర్ కింద వేడి ఎక్కువైతే పిల్లలు దూరంగా వెళ్లిపోతాయి. తక్కువైతే పిల్లలన్నీ మధ్యలో గుంపుగా ఉంటాయి. దీన్ని బట్టి వేడిని అంచనా వేసి వేడిని తగ్గించడం, పెంచడం చేయాలి.
News October 18, 2025
ముంబై పోర్ట్ అథారిటీలో 116 పోస్టులు

ముంబై పోర్ట్ అథారిటీ 116 గ్రాడ్యుయేట్, COPA అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతగల అభ్యర్థులు నవంబర్ 10 వరకు అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్(COPA) 105, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్లు 11 ఉన్నాయి. అభ్యర్థుల వయసు 14 నుంచి 18 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.100. వెబ్సైట్: https://mumbaiport.gov.in/