News January 17, 2025
SBI ఖాతాదారులకు ALERT

త్వరలోనే ఆండ్రాయిడ్ 11, అంతకంటే తక్కువ వెర్షన్ మొబైల్స్‌లో YONO సేవల్ని నిలిపివేయనున్నట్లు SBI ప్రకటించింది. అలాంటి ఫోన్లు వాడుతున్న వారు ఫిబ్రవరి 28లోపు కొత్త వెర్షన్‌కు అప్‌గ్రేడ్ అవ్వాలని అలర్ట్ సందేశాలు పంపుతోంది. యూజర్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. పాత వెర్షన్ మొబైల్స్ యూజ్ చేస్తున్నవారికి సైబర్ నేరగాళ్ల ముప్పు ఉన్నట్లు సమాచారం.
Similar News
News November 16, 2025
Infosys ఉద్యోగులకు 75% బోనస్

ఉద్యోగులకు ఇన్ఫోసిస్ శుభవార్త చెప్పింది. SEP త్రైమాసికానికి సగటున 75% బోనస్ ప్రకటించింది. ఔట్‌స్టాండింగ్ పనితీరు కనబర్చిన వారికి 83%, ఉత్తమ పనితీరు ప్రదర్శించిన వారికి 78.5%, అంచనాలు అందుకున్నవారికి 75% లభించనుంది. గతంలో కంటే 7-8% తగ్గినప్పటికీ అన్ని కేటగిరీల్లో సగటున 70.5%-83% అందనుంది. లెవల్ 4, 5, 6లోని సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, టీమ్ లీడర్లు, సీనియర్ మేనేజర్లకు ఈ బోనస్ లభిస్తుంది.
News November 16, 2025
ఇండియా-A ఘన విజయం

రాజ్‌కోట్ వేదికగా సౌతాఫ్రికా-Aతో జరిగిన రెండో అనధికార వన్డేలో ఇండియా-A 9 వికెట్ల తేడాతో గెలిచింది. 133 పరుగుల లక్ష్యాన్ని 28 ఓవర్లలో ఛేదించింది. భారత బ్యాటర్లలో రుతురాజ్ (68*) హాఫ్ సెంచరీతో రాణించగా అభిషేక్ 32, తిలక్ 29* రన్స్ చేశారు. ఈ విజయంతో 3 మ్యాచుల సిరీస్‌ను ఇండియా-A 2-0తో సొంతం చేసుకుంది. మూడో అనధికార వన్డే ఈ నెల 19న రాజ్‌కోట్‌లో జరగనుంది.
News November 16, 2025
TG న్యూస్ రౌండప్

* ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ ఇవాళ HYDలో పర్యటించారు. ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్ ఏర్పాటుచేసిన తేనీటి విందుకు CM రేవంత్, కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, సంజయ్ హాజరయ్యారు.
* రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ నెల 21న HYDలో భారతీయ కళా మహోత్సవానికి హాజరవుతారు. అక్కడి నుంచి పుట్టపర్తికి వెళ్లి సత్యసాయిబాబా శతజయంతి వేడుకల్లో పాల్గొంటారు.
* రైతులకు యాసంగి బోనస్ రూ.200 కోట్లను వెంటనే విడుదల చేయాలి: హరీశ్ రావు


