News February 5, 2025

విద్యార్థులకు ALERT.. దరఖాస్తులకు ఈ నెల 19 లాస్ట్

image

APలోని 28 ఏకలవ్య మోడల్ స్కూళ్లలో 2025-26కు 6వ తరగతిలో ప్రవేశాలకు ఈ నెల 19 వరకు <>దరఖాస్తు చేసుకోవచ్చు<<>>. 31-3-2025 నాటికి 10-13 ఏళ్ల వయసు ఉండి, ప్రస్తుతం ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు. ఒక్కో స్కూల్‌లో 60 సీట్లు(బాలురకు 30, బాలికలకు 30) ఉంటాయి. ఇంగ్లిష్, CBSE సిలబస్‌లో బోధన ఉంటుంది. ఈ నెల 25న రాత పరీక్ష ఉంటుంది. అందులో సాధించిన మెరిట్‌, రిజర్వేషన్‌ బట్టి సీట్లను భర్తీ చేస్తారు.

Similar News

News December 10, 2025

రైతుల కోసం అగ్రికల్చర్ ఎక్విప్మెంట్ బ్యాంక్: CM

image

AP: ఆధునిక సాగు యంత్రాల కోసం అగ్రికల్చర్ ఎక్విప్మెంట్ బ్యాంకు ఏర్పాటు చేయాలని CM చంద్రబాబు ఆదేశించారు. సచివాలయంలో వాణిజ్య పంటల కొనుగోళ్లపై సమీక్షించారు. ‘శాస్త్రీయ విధానంలో సాగు ప్రణాళిక, ఆధునిక యంత్రాలు, డ్రోన్ల వినియోగంతో ఖర్చు తగ్గించాలి. ఓ వెబ్‌సైట్ ప్రారంభించి పరికరాల వివరాలు తెలియజేయాలి. పత్తి కొనుగోళ్లకు సంబంధించి కపాస్ కిసాన్ యాప్‌లోని సమస్యలను CCI అధికారులు పరిష్కరించాలి’ అని ఆదేశించారు.

News December 10, 2025

క్యాన్సర్ బాధితుడి తొలగింపు.. మానవత్వం మరిచారా?

image

పుణే(MH)లో అమానవీయ ఘటన జరిగింది. క్యాన్సర్‌తో పోరాడుతున్న ఓ ఉద్యోగిని కంపెనీ అకస్మాత్తుగా తొలగించింది. ‘నాకు జీతం కాదు.. నా జీవితం కావాలి. నా కుటుంబ భవిష్యత్తు కోసం న్యాయం చేయండి’ అంటూ ఆ ఉద్యోగి అనారోగ్యాన్ని లెక్కచేయకుండా కంపెనీ గేటు ముందు నిరాహార దీక్షకు దిగాడు. కష్టకాలంలో అండగా ఉండాల్సిన కంపెనీ ఇలా తొలగించడం దారుణమని వాపోయాడు. కంపెనీ తీరుపై నెట్టింట తీవ్ర విమర్శలొస్తున్నాయి.

News December 10, 2025

ప్రపంచంలోనే అతి పొడవైన హైవే ఇదే..!

image

ప్రపంచంలోకెల్లా అతి పొడవైన రహదారి ‘పాన్-అమెరికన్’ హైవే అని మీకు తెలుసా? దీని పొడవు దాదాపు 30,000 కిలోమీటర్లు. ఇది అలాస్కాలోని ప్రుడో బే నుంచి మొదలై ఎలాంటి యూటర్న్ లేకుండా 14 దేశాల గుండా అర్జెంటీనా వరకు విస్తరించి ఉంది. ఈ రహదారి మెక్సికో, పనామా, కొలంబియా, పెరూ, చిలీ వంటి దేశాలను కలుపుతుంది. వర్షారణ్యాలు, ఎడారులను దాటే ఈ మార్గంలో ప్రయాణం పూర్తి చేయడానికి సగటున 60 రోజులు పడుతుంది.