News April 10, 2024

విద్యార్థులకు అలర్ట్.. నేడే లాస్ట్ డేట్

image

ఏపీ పాలిసెట్-2024 దరఖాస్తుల గడువు నేటితో ముగియనుంది. షెడ్యూల్ ప్రకారం ఈనెల 5న గడువు ముగియాల్సి ఉండగా, 10వ తేదీ వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. పాలిటెక్నిక్ కాలేజీల్లో డిప్లమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈ పరీక్ష ఈనెల 27న జరగనుంది. పరీక్ష తేదీలో మార్పు ఉండదని అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు.

Similar News

News April 5, 2026

ట్రంప్‌కు పిచ్చి పట్టిందా?

image

‘హార్ముజ్‌ను కంట్రోల్‌లోకి తీసుకోవడం మాకో లెక్క కాదు. రెండు నిమిషాల పని’ అని 6 రోజుల క్రితం ట్రంప్ ప్రగల్భాలు పలికారు. ఇప్పుడేమో మంగళవారం లోపు దాన్ని తెరవాలని ఇరాన్‌కు వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు బా*ర్డ్స్ అంటూ చిల్లర భాష మాట్లాడారు. దీంతో ట్రంప్ మెదడు పని చేస్తోందా? అని నెటిజన్లు ఫైరవుతున్నారు. యుద్ధాన్ని ఎలా ముగించాలో తెలియక పిచ్చిపట్టినట్లు మాట్లాడుతున్నారని మండిపడుతున్నారు.

News April 5, 2026

ALERT: 2 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు

image

AP: రాష్ట్రంలో 2 రోజులు భిన్న వాతావరణ పరిస్థితులుంటాయని APSDMA తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ.గో., ప.గో. జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి-మోస్తరు వానలు పడతాయని పేర్కొంది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురవొచ్చని చెప్పింది. ఇవాళ 66 మండలాల్లో 40డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని, కొన్నిజిల్లాల్లో ఎండలు తీవ్రంగా ఉంటాయని తెలిపింది.

News April 5, 2026

RARE: ఒకే పోలికతో నలుగురు పిల్లల జననం

image

రష్యాలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో ఒకే పోలికతో ఉన్న నలుగురు పిల్లల(quadruplets)కు మహిళ జన్మనిచ్చింది. వారంతా అమ్మాయిలే కావడం గమనార్హం. 1.55 కోట్ల మందిలో ఒకరికి ఇలా జరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. మరోవైపు రష్యాలో ఇలా జరగడం తొలిసారని తెలుస్తోంది.