News April 24, 2024
టెన్త్ ఫెయిలైన విద్యార్థులకు ALERT

AP: టెన్త్ ఫెయిలైన విద్యార్థులకు మే 24 నుంచి జూన్ 3 వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. ఈ ఎగ్జామ్స్కు నామమాత్రపు ఫీజును నేటి నుంచి ఈ నెల 30లోపు స్కూళ్ల లాగిన్ ద్వారా చెల్లించాలి. రూ.50 అపరాధ రుసుముతో మే 23 వరకు చెల్లించవచ్చు. అలాగే ఒక్కో పేపర్ రీకౌంటింగ్కు రూ.500, రీవెరిఫికేషన్కు రూ.1,000 ఫీజు ఆన్లైన్లో చెల్లించాలి. ఇవాళ్టి నుంచి ఈ నెల 30 వరకు ఛాన్స్ ఉంటుంది.
Similar News
News November 18, 2025
AP న్యూస్ రౌండప్

* ఒడిశాలో జరిగిన ఏకలవ్య మోడల్ స్కూల్స్ నేషనల్ క్రీడల్లో రాష్ట్రానికి చెందిన గిరిజన విద్యార్థులు 32 బంగారు, 42 వెండి, 40 కాంస్య పతకాలు సాధించారు.
* రాజమండ్రిలో రూ.100 కోట్లతో పైలట్ల శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు జార్విస్ ఏవియేషన్ సంస్థ వెల్లడించింది.
* ఇస్రో, TIFR, అణుశక్తి విభాగాల ఆధ్వర్యంలో డిసెంబర్ 31 వరకు రాష్ట్రంలో సైంటిఫిక్ బెలూన్ ప్రయోగాలు జరగనున్నాయి.

ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల్లో బదిలీలు.. అర్హులు ఎవరంటే?

* భార్యాభర్తల్లో ఎవరైనా ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, వర్సిటీల్లో పనిచేస్తూ ఉండాలి.
* ఒకరు ప్రభుత్వ, మరొకరు ప్రైవేట్ ఉద్యోగి అయితే <<18315066>>బదిలీ<<>> వర్తించదు.
* మ్యారేజ్ సర్టిఫికెట్, ఎంప్లాయిమెంట్ ఐడీ కార్డు తప్పనిసరి.
* ప్రభుత్వానికి బకాయిలు లేనట్లు ధ్రువీకరణపత్రం ఉండాలి.
* మెరిట్ ర్యాంకు ఆధారంగా బదిలీ చేస్తారు. ఒకవేళ టై అయితే సీనియారిటీ, DOB ఆధారంగా ప్రాధాన్యత ఇస్తారు.