News June 26, 2024
టెన్త్ విద్యార్థులకు అలర్ట్

AP: ఇవాళ విడుదలైన టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాల్లో 62.21శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 96.15శాతం ఉత్తీర్ణత అవ్వగా, కర్నూలు జిల్లాలో అత్యల్పంగా 30.60శాతం మంది పాస్ అయ్యారు. జూన్ 27 నుంచి జులై 1 వరకు రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ప్రతి సబ్జెక్టుకు రీకౌంటింగ్‌కు రూ.500, రీవెరిఫికేషన్‌కు రూ.1000 చెల్లించాలి.
Similar News
News January 7, 2026
ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్లు కొట్టివేత

TG: నాంపల్లి కోర్టులో ఐబొమ్మ రవికి బిగ్ షాక్ తగిలింది. 5 కేసుల్లో ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను న్యాయస్థానం కొట్టేసింది. అతడికి విదేశాల్లో పౌరసత్వం ఉందని, బెయిల్ ఇస్తే దేశం దాటి పోయే అవకాశం ఉందని పోలీసులు వాదించారు. వారి వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం రవి బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది.
News January 7, 2026
RARE: పర్ఫెక్ట్ ఫిబ్రవరి.. గమనించారా?

వచ్చే ఫిబ్రవరి నెలను ‘పర్ఫెక్ట్ ఫిబ్రవరి’గా నెటిజన్లు అభివర్ణిస్తున్నారు. ఆ నెల ఆదివారంతో మొదలై సరిగ్గా 28 రోజులు పూర్తి చేసుకుని శనివారంతో ముగియనుంది. అంటే ఎక్కడా మిగిలిపోకుండా కచ్చితంగా 4 వారాల కాలచక్రాన్ని కలిగి ఉండటం విశేషం. చివరిసారిగా 2015లో ఇలానే జరిగింది. క్యాలెండర్లో నెలంతా ఒక క్రమ పద్ధతిలో సెట్ అవ్వడంతో దీనిపై నెటిజన్లు చర్చించుకుంటున్నారు. మీరూ ఇది గమనించారా? COMMENT
News January 7, 2026
తెలుగులో ఛార్జ్‌షీట్.. పోలీసు శాఖలో సరికొత్త అధ్యాయం

TG: పోలీస్ దర్యాప్తు, కోర్టు పత్రాల సమర్పణ అంతా ఇంగ్లిష్‌లోనే ఉంటుంది. దీంతో అటు బాధితులు, ఇటు నిందితులకు అందులోని అంశాలు అర్థం కాక ఇబ్బందులు పడుతుంటారు. ఈ పరిస్థితుల్లో దుండిగల్ PSలో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ స్వరూప తెలుగులో 2 ఛార్జ్షీట్లు దాఖలు చేసి పోలీస్ శాఖలో సరికొత్త ఒరవడికి నాంది పలికారు. తాజాగా డీజీపీ శివధర్ రెడ్డి, ఐపీఎస్ శిఖా గోయల్ ఆమెకు ప్రశంసా పత్రం అందజేశారు.


