News January 21, 2025

టెట్ అభ్యర్థులకు అలర్ట్

image

TG: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) ప్రిలిమినరీ ‘కీ’ని ఈనెల 24న విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈనెల 27న సా.5 గంటల వరకు పూర్తి ఆధారాలతో https://schooledu.telangana.gov.in వెబ్‌సైట్‌లో అభ్యంతరాలు సమర్పించవచ్చని తెలిపారు. పరీక్షలు నిన్నటితో ముగియగా, మొత్తం 2.05 లక్షల మంది హాజరయ్యారు. 74.44% హాజరు నమోదైంది.

Similar News

News January 21, 2025

సైఫ్ అలీఖాన్ డిశ్చార్జ్

image

కత్తిపోట్లకు గురైన బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ముంబై లీలావతి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కాసేపటి క్రితం ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్లిపోయారు. జనవరి 16న బాంద్రాలోని సైఫ్ నివాసంలో దుండగుడు కత్తితో దాడి చేశాడు.

News January 21, 2025

PHOTOS: ఫ్యామిలీతో అల్లు అర్జున్

image

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో దిగిన కొత్త ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. భార్య స్నేహా రెడ్డితో పాటు కొడుకు అయాన్, కూతురు అర్హ వైట్ టీషర్టు ధరించి కెమెరాలకు పోజులిచ్చారు. మొన్నటి వరకు ‘పుష్ప-2’ సినిమా కోసం హెయిర్, బియర్డ్ పెంచిన బన్నీ.. తాజాగా తన లుక్‌ను మార్చేసిన విషయం తెలిసిందే. కాగా, మార్చి నెల నుంచి త్రివిక్రమ్- అల్లు అర్జున్ కాంబోలో సినిమా ప్రారంభం కానుంది.

News January 21, 2025

భారత్‌తో తొలి T20.. ఇంగ్లండ్ జట్టు ప్రకటన

image

భారత్‌తో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో రేపు జరిగే తొలి T20 కోసం ఇంగ్లండ్ జట్టును ప్రకటించింది. బట్లర్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, సాల్ట్(కీపర్), డక్కెట్, బ్రూక్, లివింగ్ స్టోన్, బెథెల్, ఓవర్టన్, అట్కీన్‌సన్, అర్చర్, రషీద్, వుడ్ జట్టులో ఉండనున్నారు. ఈ మేరకు జట్టును కోచ్ మెక్‌కల్లమ్ ప్రకటించారు.