News March 13, 2025
ఉచిత గ్యాస్ సిలిండర్ తీసుకునేవారికి అలర్ట్

AP: ‘దీపం-2’ పథకంలో ఉచిత గ్యాస్ సిలిండర్ ఇప్పటికీ తీసుకోనివారు ఈ నెలఖారులోగా మొదటిది బుక్ చేసుకోవాలని పౌర సరఫరాల శాఖ కమిషనర్ సౌరభ్ గౌర్ సూచించారు. లేదంటే మూడు సిలిండర్లలో ఒకటి కోల్పోతారని చెప్పారు. ఏప్రిల్ నుంచి రెండో సిలిండర్ బుకింగ్లు ప్రారంభమవుతాయన్నారు. ఈ పథకం కింద ఇప్పటివరకు 97 లక్షల మంది లబ్ధిదారులు ఉచిత గ్యాస్ బుక్ చేసుకున్నట్లు వెల్లడించారు.
Similar News
News November 24, 2025
అమెరికా వీసా రాలేదని..

ట్రంప్ కఠిన వీసా నిబంధనలు తెలుగు డాక్టర్ మరణానికి కారణమయ్యాయి. US వీసా రాలేదని గుంటూరుకు చెందిన డా.రోహిణి HYDలో ఆత్మహత్య చేసుకున్నారు. MBBS చేసిన ఆమె USలో PG చేసేందుకు J1 వీసాకు దరఖాస్తు చేశారు. HYDలోని US కాన్సులేట్లో జరిగిన చివరి రౌండ్ ఇంటర్వ్యూలో ‘శాశ్వతంగా USలోనే ఉండిపోవాలనే ఉద్దేశం’ అని కారణాన్ని చూపుతూ రిజెక్ట్ చేశారు. దీంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన రోహిణి సూసైడ్ చేసుకున్నారు.
News November 24, 2025
DEC తొలి వారంలో కానిస్టేబుల్ అభ్యర్థులకు నియామక పత్రాలు!

AP: కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి DEC తొలి వారంలో నియామక పత్రాలు అందజేసి, శిక్షణకు పంపిస్తామని హోంమంత్రి అనిత హామీ ఇచ్చినట్లు MLC వేపాడ చిరంజీవి తెలిపారు. ఇదే విషయమై ఆమెకు లేఖ రాయగా సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. 6,100 కానిస్టేబుల్ పోస్టులకు ఈ ఏడాది జూన్లో మెయిన్స్ నిర్వహించి AUGలో ఫలితాలు ప్రకటించారు. ఉద్యోగాలకు ఎంపిక చేసినా ట్రైనింగ్ ప్రారంభం కాకపోవడంతో అభ్యర్థులు నిరాశతో ఉన్నారు.
News November 24, 2025
బీమా కంపెనీల విలీనం.. పార్లమెంటులో బిల్లు?

బ్యాంకుల తరహాలోనే ప్రభుత్వ రంగంలోని బీమా కంపెనీల విలీన ప్రతిపాదన మళ్లీ తెరపైకి వచ్చింది. ఓరియంటల్, నేషనల్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్లను ఒకే కంపెనీగా చేయనున్నట్లు సమాచారం. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో బిల్లును ప్రవేశపెడతారని తెలుస్తోంది. వాటిని ఆర్థికంగా మెరుగుపర్చడమే దీని ఉద్దేశం. 2018-19లో ఈ ప్రతిపాదన వచ్చినప్పటికీ మధ్యలోనే ఆగిపోయింది. అప్పట్లో వీటి బలోపేతానికి కేంద్రం ₹17450Cr కేటాయించింది.


