News July 21, 2024
రుణమాఫీ డబ్బులు రాని వారికి ALERT

TG: రుణమాఫీ తొలి విడతలో భాగంగా 11.50 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.6098కోట్లు జమ చేసినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. 99శాతం మంది ఖాతాల్లో నగదు జమ అయ్యిందని తెలిపారు. నగదు జమ కాని వారు తమ మండల వ్యవసాయాధికారిని, విస్తరణాధికారిని కలిసి ఆధార్ కార్డు నంబర్ ఇస్తే పరిశీలించి సమాచారం ఇస్తారన్నారు. ఆధార్ కార్డులు సరిగా లేనివారి వద్ద ఇతర ఆధారాలు తీసుకునే అంశాన్ని పరిశీలిస్తామన్నారు.
Similar News
News November 20, 2025
బండి సంజయ్‌పై పేపర్ లీకేజీ కేసు కొట్టివేత

TG: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌పై దాఖలైన టెన్త్ క్లాస్ పేపర్ లీకేజీ కేసును హైకోర్టు కొట్టేసింది. 2023లో పదో తరగతి హిందీ పేపర్ లీకేజీకి కారణమంటూ కమలాపూర్ PSలో ఆయనపై కేసు నమోదైంది. దీనిపై ఆయన HCని ఆశ్రయించగా సరైన సెక్షన్లు, ఆధారాలు లేవంటూ తాజాగా కేసును క్వాష్ చేసింది. మరోవైపు 2023 ఎన్నికల సమయంలో కోడ్ ఉల్లంఘించారంటూ మాజీ మంత్రి KTR, గోరటి వెంకన్నపై దాఖలైన FIRనూ HC కొట్టివేసింది.
News November 20, 2025
ఇతిహాసాలు క్విజ్ – 72 సమాధానాలు

నేటి ప్రశ్న: కురుక్షేత్రంలో కర్ణుడి రథ చక్రం నేలలో కూరుకు పోవడానికి, అది బయటకు రాకపోవడానికి కారణం ఏంటి?
జవాబు: ఓసారి కర్ణుడు భూమిపై పడిన నెయ్యిని తీస్తూ నెయ్యి తడిసిన మట్టిని చేతులతో బలంగా పిండాడు. ఈ చర్యతో బాధపడిన భూమాత ఆగ్రహించింది. ‘నువ్వు నాకు ఈ బాధకు కలిగించినందుకు ప్రతిచర్యగా నీ జీవితంలో అతి కీలకమైన యుద్ధ సమయంలో నీ రథ చక్రాన్ని నేలలో బలంగా పట్టుకుంటాను’ అని శపించింది.
<<-se>>#Ithihasaluquiz<<>>
News November 20, 2025
రేపు ఈ జిల్లాల్లో వర్షాలు: APSDMA

AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు వర్షాలు పడతాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. కాగా ఈ నెల 22న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, NOV 24 నాటికి వాయుగుండంగా, ఆ తర్వాత తుఫానుగా మారుతుందని ఇప్పటికే ఓ ప్రకటనలో పేర్కొన్న సంగతి తెలిసిందే.


