News July 17, 2024
ఆధార్ లేనివారికి అలర్ట్

AP: ఆధార్ నమోదు కోసం ఈనెల 23 నుంచి 27 వరకు గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయనున్నారు. అవసరాన్ని బట్టి స్కూళ్లు, కాలేజీలు, అంగన్వాడీ కేంద్రాల్లోనూ శిబిరాల నిర్వహణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 0-5 ఏళ్లలోపు వారికి కొత్త ఆధార్ నమోదుతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 1.36 కోట్ల మంది డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాల్సి ఉంది. ప్రత్యేక శిబిరాల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నారు.
Similar News
News November 24, 2025
AP TET.. ఎన్ని దరఖాస్తులు వచ్చాయంటే?

AP: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) దరఖాస్తుల గడువు నిన్నటితో ముగిసింది. మొత్తం 2.59 లక్షల అప్లికేషన్లు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఇన్ సర్వీస్ టీచర్లు 32,000 మంది దరఖాస్తు చేశారు. డిసెంబర్ 3 నుంచి హాల్ టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి. డిసెంబర్ 10 నుంచి ఆన్లైన్లో రెండు సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి.
News November 24, 2025
తిరుమల కొండపై ‘బంగారు బావి’ వైభవం

శ్రీవారి దర్శనం తర్వాత కనిపించేదే ‘బంగారు బావి’. దీనికి బంగారు రేకుల తాపడం ఉంటుంది. అందుకే ఈ పేరొచ్చింది. ఇందులో నుంచి వచ్చే జలాన్ని స్వామి కైంకర్యాలకు ఉపయోగిస్తారు. ఈ బావి అడుగున వైకుంఠంలో ప్రవహించే విరజానది ప్రవహిస్తుందని నమ్ముతారు. పూర్వజన్మలో తొండమాన్ చక్రవర్తిగా ఉన్న రంగదాసు ఈ పవిత్ర బావిని నిర్మించినట్లు స్థల పురాణం చెబుతోంది. అందుకే ఈ జలం అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. <<-se>>#VINAROBHAGYAMU<<>>
News November 24, 2025
అన్క్లెయిమ్డ్ డిపాజిట్ల వివరాలు తెలుసుకోండిలా

బ్యాంకు ఖాతాల్లోని అన్క్లెయిమ్డ్ డిపాజిట్ల వివరాలను RBI ఉద్గం <


