News March 4, 2025

ఇంటర్ పరీక్షలు రాసేవారికి అలర్ట్

image

TG: రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉ.9 నుంచి మ.12 వరకు ఎగ్జామ్స్ ఉంటాయి. తప్పనిసరి పరిస్థితుల్లో 5 ని.లు ఆలస్యమైనా అనుమతిస్తామని అధికారులు పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల అడ్రస్ విషయంలో గందరగోళానికి గురికాకుండా హాల్‌టికెట్లపై QR కోడ్ ముద్రించామని తెలిపారు. ఏవైనా సమస్యలు ఉంటే 9240205555కు కాల్ చేయాలని సూచించారు. 9 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.
*ALL THE BEST STUDENTS

Similar News

News March 5, 2025

ఆ మూవీలో ప్రతీ సీన్ గుర్తుంది: సమంత

image

సినిమా ఇండస్ట్రీలో 15 ఏళ్లు పూర్తి చేసుకున్న సమంత కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు చూసినట్లు తెలిపారు. తొలి చిత్రం ‘మాస్కో కావేరి’ షూటింగ్ అంతరాయాల వల్ల పెద్దగా గుర్తులేదన్నారు. ఆ తర్వాత మొదలైన ‘ఏమాయ చేశావే’లో అన్ని సీన్లు గుర్తున్నట్లు చెప్పారు. ఆ సినిమాలోని ప్రతి డీటెయిల్ ఇప్పటికీ మర్చిపోలేదన్నారు. ఆ స్థాయిలో సంతృప్తి ఇచ్చిన పాత్రలు తక్కువని, గౌతమ్ మేనన్‌తో పనిచేయడం గొప్ప అనుభూతి అని తెలిపారు.

News March 5, 2025

భారత్ గెలుపు.. కాంగ్రెస్ నేత షామా ట్వీట్

image

ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్‌లో ఆస్ట్రేలియాపై అద్భుత విజయం సాధించిన టీమ్ ఇండియాకు శుభాకాంక్షలు అని కాంగ్రెస్ నేత షామా మహమ్మద్ ట్వీట్ చేశారు. ‘కీలక మ్యాచ్‌లో 84 రన్స్‌ చేయడంతో పాటు ICC నాకౌట్ మ్యాచుల్లో వెయ్యి రన్స్ చేసిన తొలి ప్లేయర్‌గా నిలిచిన విరాట్ కోహ్లీకి ప్రత్యేక అభినందనలు’ అని ఆమె రాసుకొచ్చారు. కాగా ఇటీవల రోహిత్ శర్మపై బాడీ షేమింగ్ కామెంట్స్ చేయడంతో షామా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు.

News March 4, 2025

ఐదో రౌండ్ పూర్తి: ముందంజలో బీజేపీ అభ్యర్థి

image

TG: ఆదిలాబాద్-కరీంనగర్-నిజామాబాద్-మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి దూసుకెళ్తున్నారు. ఐదు రౌండ్లు ముగిసేసరికి 7,142 ఓట్ల ముందంజలో ఉన్నారు. అంజిరెడ్డికి 38,553, నరేందర్ రెడ్డి (కాంగ్రెస్) 31,411, ప్రసన్న హరికృష్ణ (బీఎస్పీ) 26,300 ఓట్లు సాధించారు.

error: Content is protected !!