News February 24, 2025
తిరుమల భక్తులకు అలర్ట్

తిరుమల రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్లు ఇవాళ ఉదయం 10 గంటలకు విడుదల కానున్నాయి. మే నెలకు సంబంధించిన టికెట్లను టీటీడీ అధికారిక వెబ్సైట్లో రిలీజ్ చేయనుంది. మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతి గదుల కోటా టికెట్లను ఆన్లైన్లో అందుబాటులోకి తేనుంది.
వెబ్సైట్: <
Similar News
News February 24, 2025
మా కుటుంబ గొడవలకు ముగింపు రావాలి: మంచు విష్ణు

తనకు ఉమ్మడి కుటుంబం అంటే ఇష్టమని హీరో మంచు విష్ణు చెప్పారు. అలాంటి వాతావరణంలో పిల్లలు పెరగాలనేది తన కోరిక అని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. తన ఫ్యామిలీలో గొడవలకు త్వరగా ఫుల్స్టాప్ పడితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. శివుడు ప్రత్యక్షమై వరమిస్తానంటే ఎన్ని జన్మలైనా తండ్రిగా మోహన్‌బాబే ఉండాలని కోరుకుంటానని పేర్కొన్నారు. ఇటీవల మంచు ఫ్యామిలీలో వివాదాలు చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.
News February 24, 2025
తిరుమల శ్రీవారి టికెట్లు విడుదల

AP: తిరుమల శ్రీవారి మే నెల కోటా ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల(రూ.300)ను టీటీడీ విడుదల చేసింది. అలాగే, మధ్యాహ్నం 3 నుంచి తిరుమల, తిరుపతిలో గదుల కోటా టికెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉండనున్నాయి. శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లను అధికారిక సైట్లోనే బుక్ చేసుకోవాలని <
News February 24, 2025
అసెంబ్లీకి చేరుకున్న చంద్రబాబు, జగన్

AP: బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో సీఎం చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీకి చేరుకున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా సభకు హాజరయ్యారు. కాసేపట్లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఉభయసభలనుద్దేశించి ప్రసంగించనున్నారు. చాలా రోజుల తర్వాత జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరవుతుండటంతో ఆసక్తి నెలకొంది.