News May 22, 2024

యూజీసీ నెట్ అభ్యర్థులకు అలర్ట్

image

యూజీసీ నెట్ జూన్-2024 దరఖాస్తుల సవరణకు రేపు రాత్రి 11:59 గంటల వరకు అవకాశం కల్పిస్తున్నట్లు NTA ప్రకటించింది. ఏవైనా తప్పులు ఉంటే యూజీసీ నెట్ <>వెబ్‌సైట్‌లో<<>> ఎడిట్ చేసుకోవాలని, ఆ తర్వాత రివైస్‌డ్ ఫామ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించింది. జూన్ 18న ఈ పరీక్ష జరగనున్న సంగతి తెలిసిందే.

Similar News

News December 3, 2025

సోషల్ మీడియాలోనే క్యాంపెయిన్

image

TG: తరం మారింది. తలరాతలు మార్చే ప్రచార వేదికలూ మారుతున్నాయి. ప్రతి ఒక్కరి చేతుల్లోని స్మార్ట్ ఫోన్‌ను చేరేలా పంచాయతీ అభ్యర్థుల ప్రచారం సాగుతోంది. దీంతో గోడలపై, ఇళ్లకు పోస్టర్లు, మైకుల సందడికి సోషల్ మీడియా అదనంగా చేరింది. రెగ్యులర్ ఆఫ్‌లైన్ క్యాంపెయిన్లతో పాటు వాట్సాప్‌లో వీడియోలతోనూ ఓటు అభ్యర్థిస్తున్నారు. ఊరి వాట్సాప్ గ్రూప్స్‌లో డిస్కషన్స్ పోల్స్ రిజల్ట్‌ను బట్టి హామీలు, వ్యూహాలూ మారుతున్నాయి.

News December 3, 2025

విష్ణుమూర్తి నామాల్లోనే ఆయన మహిమలు

image

అగ్రాహ్య శ్శాశ్వతః కృష్ణో లోహితాక్షః ప్రతర్దనః|
ప్రభూత స్త్రికకుబ్ధామ ప్రవిత్రం మంగళం పరమ్||
విష్ణుమూర్తి అగ్రాహ్యుడు. అంటే ఆయన గురించి తెలుసుకోవడం అసాధ్యం. అలాగే శాశ్వతుడు, చీకటిని పాలద్రోలే శ్రీకృష్ణుడు. ఆయనే ఎర్రటి కనుల లోహితాక్షుడు. ప్రతర్దనః, ప్రభూతః కూడా విష్ణువే. 3 లోకాలలను పాలించే పవిత్రుడు, మంగళ స్వరూపుడు, వెలుగునే తన మార్గంగా మార్చుకున్న నారాయణుడే మన ఆది దేవుడు. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>

News December 3, 2025

శీతాకాలంలో జుట్టు ఎక్కువగా రాలుతోందా?

image

మిగతా సీజన్​లతో పోలిస్తే చలికాలంలో జుట్టు సమస్యలు అధికమవుతాయి. ఇలా కాకుండా ఉండాలంటే కొన్నిజాగ్రత్తలు పాటించాలంటున్నారు నిపుణులు. వారానికి రెండుసార్లు గోరువెచ్చటి నీటితో తలస్నానం చెయ్యాలి. తర్వాత కండిషనర్ తప్పనిసరి. ఈ కాలంలో బ్లో డ్రైయ్యర్స్ వాడకం ఎంత తగ్గిస్తే అంత మంచిది. అలాగే ఈ సీజన్​లో వెంట్రుకలకు ఎంత తరచుగా ఆయిల్ పెడితే అంత మంచిది. ఇది జుట్టులోని తేమ శాతం ఎక్కువసేపు ఉండటానికి సహాయపడుతుంది.