News April 7, 2025
వాట్సాప్ యూజర్లకు అలర్ట్

ఆన్‌లైన్ మోసాల పట్ల వాట్సాప్ యూజర్లు అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. మొబైల్ నంబర్‌కి OTP పంపి, అనుకోకుండా పంపామని మోసగాళ్లు వాట్సాప్‌లో చాట్ చేస్తున్నారని తెలిపారు. వాట్సాప్‌ను హ్యాక్ చేసి సన్నిహితుల నంబర్లకు మీ పేరుతో డబ్బులు పంపించాలంటూ సందేశాలతో మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని, అవసరమైతే సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించాలన్నారు.
Similar News
News April 10, 2025
ప్రధాని మోదీకి రష్యా ఆహ్వానం

వచ్చే నెల 9న తమ దేశంలో జరిగే 80వ విక్టరీ పరేడ్ వేడుకలకు రావాలని ప్రధాని మోదీని రష్యా ఆహ్వానించింది. రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీపై సాధించిన గెలుపును రష్యా ఏటా మే 9న ఘనంగా జరుపుకుంటుంటుంది. మాస్కో ఆహ్వానం అందిందని, ప్రధాని మోదీ పాల్గొనే విషయాన్ని సరైన సమయం చూసి ప్రకటిస్తామని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. భారత ప్రధాని సహా పలు దేశాల అధినేతలకు రష్యా ఆహ్వానం పంపించినట్లు సమాచారం.
News April 10, 2025
‘విశ్వంభర’ ఆలస్యం వెనుక అదే కారణం?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ట తెరకెక్కిస్తున్న ‘విశ్వంభర’ను ఈ ఏడాది జనవరికే విడుదల చేయాలనుకున్నా దాన్ని తర్వాత వాయిదా వేశారు. మూవీలో ఓ స్పెషల్ సాంగ్‌కి కీరవాణి ఇచ్చిన ట్యూన్ చిరుకు నచ్చకపోవడమే వాయిదా వెనుక కారణమని టాలీవుడ్ సర్కిల్స్ చెబుతున్నాయి. కీరవాణి కొత్త ట్యూన్ ఇచ్చే పనిలో ఉన్నారని వెల్లడించాయి. ఈ స్పెషల్ సాంగ్‌లో చిరు మాస్ స్టెప్స్ వేయనున్నారని స్పష్టం చేశాయి.
News April 10, 2025
బ్యాడ్మింటన్ ఆసియా: రెండో రౌండ్‌కు దూసుకెళ్లిన సింధు

బ్యాడ్మింటన్ ఆసియా ఛాంపియన్ షిప్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు రెండో రౌండ్‌కు దూసుకెళ్లారు. ఇండోనేషియాకు చెందిన ఎస్తేర్ వార్డోయోపై ఆమె వరస సెట్లలో 21-15, 21-19 తేడాతో గెలుపొందారు. తర్వాతి రౌండ్‌లో జపాన్‌కు చెందిన అకానీ యమగుచీతో ఆమె తలపడనున్నారు. మరోవైపు లక్ష్యసేన్, ప్రణోయ్ ఇద్దరూ ఇంటిబాట పట్టారు.