News October 25, 2024

ALERT: వీరికే ఉచిత సిలిండర్

image

AP: రాష్ట్రంలో ఉచిత సిలిండర్‌కు ప్రభుత్వం విధివిధానాలు ఖరారు చేసింది. తెల్లరేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉన్నవారు ఈ పథకానికి అర్హులుగా ప్రకటించింది. ఈనెల 29 నుంచి గ్యాస్ బుకింగ్ ప్రారంభం కానుండగా దీపావళి సందర్భంగా 31న తొలి ఉచిత సిలిండర్ డెలివరీ చేస్తామని తెలిపింది. కాగా ఆర్థిక సంవత్సరంలో 4 నెలలకు ఒకటి చొప్పున మొత్తం 3 సిలిండర్లను ప్రభుత్వం ఉచితంగా అందించనుంది.

Similar News

News October 25, 2024

గ్రీన్ యాపిల్‌నూ తినండి బాబూ!

image

చాలామంది రెడ్ యాపిల్‌నే తింటుంటారు. కానీ గ్రీన్ యాపిల్ తినడం వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిలో ఉండే ఫైబర్, విటమిన్లు, మినరల్స్ శరీరానికి అవసరమైన శక్తిని ఇస్తాయి. ఇవి బరువు తగ్గేందుకు సహాయపడతాయి. ఇందులో ఉండే పొటాషియం రక్త సరఫరాను మెరుగుపరచి హైబీపీ, గుండె జబ్బులు, క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటుంది. నోటి దుర్వాసన తగ్గుతుంది. మలబద్దకం, అసిడిటీ, అజీర్ణం తగ్గుతాయి.

News October 25, 2024

ఆ రైతుల కోసం వాట్సాప్ సేవలు: మంత్రి తుమ్మల

image

TG: పత్తి రైతులకు అమ్మకం, కొనుగోళ్లకు సంబంధించిన వివరాలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వాట్సాప్ సేవలను ప్రారంభించింది. 8897281111 నంబరు ద్వారా కొనుగోళ్లు, అమ్మకం, అర్హత, తదితర వివరాలను రైతులు ఇంటి వద్ద ఉండే తెలుసుకోవచ్చని మంత్రి తుమ్మల తెలిపారు. అంతేకాకుండా రైతులు ఎలాంటి ఫిర్యాదు చేసినా మార్కెటింగ్ శాఖ సత్వరమే చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు.

News October 25, 2024

మేము మతమార్పిళ్లు చేయలేదు: జెమీమా తండ్రి

image

తాము ఎటువంటి మతమార్పిళ్లకు పాల్పడలేదని భారత క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్ తండ్రి ఇవాన్ ఓ ప్రకటనలో తెలిపారు. ముంబైలోని ఖర్ జింఖానా సౌకర్యాలను ప్రేయర్ కోసం వాడుకున్న మాట నిజమేనని పేర్కొన్నారు. ‘జింఖానా నిబంధనలకి లోబడే మా మీటింగ్స్ పెట్టుకున్నాం. ఆ విషయాన్ని మీడియా తప్పుగా చూపించింది. మేం చట్టాన్ని గౌరవించే నిజాయితీపరులం. ఎవర్నీ ఇబ్బంది పెట్టకుండా మా విశ్వాసాల్ని మేం అనుసరిస్తున్నాం’ అని వివరించారు.