News January 4, 2025
ALERT: జిరాక్స్ షాప్‌కు వెళ్తున్నారా?

ప్రింట్ తీసేటప్పుడు జిరాక్స్ షాప్ వాళ్లు అదనపు కాపీలు తీసుకుంటుంటే అభ్యంతరం చెప్పాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే ఆ డేటా కలెక్షన్ ఏజెంట్లు, సైబర్ నేరగాళ్లకు చేరే ఛాన్సుందని, వాటితో సిమ్‌లు, బ్యాంకు ఖాతాలు తీసి స్కామ్‌లకు పాల్పడొచ్చని అంటున్నారు. అలాగే వాట్సాప్‌లో డాక్యుమెంట్ షేర్ చేశాక డిలీట్ చేయాలని, లేదంటే పెన్ డ్రైవ్‌లో సేవ్ చేసి ఇతరులు కాపీ చేయకుండా లాక్ చేయాలని సూచిస్తున్నారు.
Similar News
News November 7, 2025
ఎగుమతులే లక్ష్యంగా విశాఖలో గ్లోబల్ సదస్సు

AP నుంచి ఎగుమతులు పెంచడంపై ప్రభుత్వం దృష్టిసారించింది. ఈ నెల 9, 10 తేదీల్లో విశాఖలో ‘ఏపీ గ్లోబల్ MSME ఎక్స్‌పోర్ట్స్ డెవలప్మెంట్ సమ్మిట్’ నిర్వహించనుంది. బ్రిటన్, రష్యా, ఆస్ట్రియా, జపాన్, హంగేరీ, ఈజిప్ట్, న్యూజిలాండ్, ఉగాండా, జింబాబ్వేతోపాటు 16 దేశాలకు చెందిన 34 మంది అంతర్జాతీయ కొనుగోలుదారులు పాల్గొంటారు. రాష్ట్రంలోని సంస్థలు తయారుచేసే ఉత్పత్తులు, వాటి ఎగుమతుల అవకాశాలను అధికారులు వివరిస్తారు.
News November 7, 2025
అంగ ప్రదక్షిణ టోకెన్ల జారీలో మార్పులు

AP: శ్రీవారి ఆలయంలో అంగ ప్రదక్షిణ చేసే భక్తులకు అలర్ట్. వారికి టోకెన్ల కేటాయింపు విధానంలో టీటీడీ మార్పులు చేసింది. ప్రస్తుతం రోజూ 750 టికెట్లను ఆన్లైన్ డిప్ విధానంలో జారీ చేస్తుండగా, ఈ విధానాన్ని రద్దు చేసింది. ‘ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్’ పద్ధతిలో టికెట్లు కేటాయించనుంది. ఇకపై 3 నెలల ముందుగానే ఆన్లైన్లో టికెట్లు విడుదలవుతాయని తెలిపింది.
News November 7, 2025
సచివాలయాల పేరును మార్చలేదు: CMO

AP: గ్రామ, వార్డు సచివాలయాల పేరును ‘విజన్ యూనిట్లు’గా మార్చారని వస్తున్న వార్తలు అవాస్తవమని సీఎంవో వివరణ ఇచ్చింది. 2047 స్వర్ణాంధ్ర విజన్ సాధన కోసం విజన్ యూనిట్లుగా గ్రామ, వార్డు సచివాలయాలు పని చేయాలని సీఎం దిశానిర్దేశం చేశారని పేర్కొంది. అంతే తప్ప వాటి పేరును విజన్ యూనిట్లుగా మార్చలేదని తెలిపింది.


