News March 17, 2025
ALERT.. 202 మండలాల్లో వడగాలులు

AP: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటాయి. నిన్న అనకాపల్లి జిల్లా నాతవరంలో అత్యధికంగా 42.1 డిగ్రీలు నమోదైంది. ఇవాళ 202 మండలాల్లో వడగాలులు వీస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. విజయనగరం, పల్నాడు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, పల్నాడు, తూర్పుగోదావరి, అనకాపల్లి, కాకినాడ, గుంటూరు, ఏలూరు, కృష్ణా, విజయనగరం, అల్లూరి, కోనసీమ, NTR, పశ్చిమగోదావరి, వైజాగ్, బాపట్లలో వడగాలులు వీస్తాయని పేర్కొంది.
Similar News
News March 17, 2025
విషాదం: అమెరికాలో ముగ్గురు తెలంగాణవాసుల మృతి

TG: రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలానికి చెందిన ముగ్గురు అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. టేకులపల్లి మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డి కుమార్తె ప్రగతి రెడ్డి(35), మనవడు హార్వీన్(6), ప్రగతి రెడ్డి అత్త సునీత(56)గా గుర్తించారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు కన్నుమూయడం టేకులపల్లిలో విషాదాన్ని నింపింది.
News March 17, 2025
డీఎంకే లక్ష్యంగా బీజేపీ ఆందోళనలు

తమిళనాడులో డీఎంకే సర్కార్ టార్గెట్‌గా బీజేపీ ఆందోళనలకు దిగింది. మద్యం దుకాణాల ముట్టడికి బీజేపీ పిలుపునివ్వగా పార్టీ చీఫ్ అన్నామలై సహా కీలక నేతలు హౌస్ అరెస్టయ్యారు. లిక్కర్ అమ్మకాల ద్వారా డీఎంకేకు రూ.1000 కోట్లు ముట్టాయని బీజేపీ ఆరోపణలకు పాల్పడుతోంది. రూపీ(₹) సింబల్ పేరుతో డీఎంకే నేతలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
News March 17, 2025
RECORD: FY25లో ₹1.75 లక్షల కోట్ల ఫోన్లు ఎగుమతి

భారత్ సరికొత్త రికార్డు సృష్టించింది. FY25 తొలి 11 నెలల్లోనే రూ.1.75లక్షల కోట్ల ($21B) విలువైన మొబైల్ ఫోన్లను ఎగుమతి చేసింది. IT మినిస్టర్ అశ్వినీ వైష్ణవ్ అంచనా వేసిన $20Bతో పోలిస్తే ఇది ఎక్కువే. FY24లో ఎగుమతి చేసిన $15.6Bతో చూస్తే ఏకంగా 54% ఎక్కువ. భారత్ నుంచి అమెరికా, బ్రిటన్, UAE, నెదర్లాండ్స్‌కు యాపిల్, శామ్‌సంగ్ మొబైళ్లు ఎగుమతి అవుతున్నాయి. అందులో USకే 50% కన్నా ఎక్కువ వెళ్తున్నాయి.