News July 16, 2024
ALERT: అతిభారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఈనెల 19న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో APలో 5 రోజులు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. నేడు రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు, మిగతా 4 రోజుల్లో కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది. అటు TGలోనూ రాబోయే 5 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.
Similar News
News November 8, 2025
ఇజ్రాయెల్ PM అరెస్టుకు తుర్కియే వారెంట్

గాజాలో విధ్వంసం, నరమేధానికి కారణమంటూ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అరెస్టుకు తుర్కియే వారెంట్ జారీచేసింది. ఆయనతో పాటు మంత్రులు కట్జ్, ఇతమాన్ బెన్ గ్విర్, ఇతర అధికారులతో మొత్తం 37 మందిని వారెంటులో చేర్చినట్లు ఇస్తాంబుల్ ప్రాసిక్యూటర్స్ ఆఫీస్ పేర్కొంది. అయితే ఇజ్రాయెల్ దీన్ని ఖండించింది. తుర్కియే నిరంకుశ పాలకుడు ఎర్డోగన్ ప్రజలను మభ్యపెట్టే స్టంట్ ఇది అని విదేశాంగ మంత్రి గిడియాన్ సార్ విమర్శించారు.
News November 8, 2025
పాపులేషన్ రీసెర్చ్ సెంటర్లో ఉద్యోగాలు

ఆంధ్ర యూనివర్సిటీలోని పాపులేషన్ రీసెర్చ్ సెంటర్ 6 ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈనెల 25వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డెమోగ్రఫి, పాపులేషన్ స్టడీస్, స్టాటిస్టిక్స్, బయోస్టాటిస్టిక్స్, ఎకనామిక్స్, సోషియాలజీ, సోషల్ వర్క్, సైకాలజీ, ఆంత్రోపాలజీలో మాస్టర్ డిగ్రీ, M.Phil, PhDతో పాటు SET/SLET/NET అర్హత సాధించి ఉండాలి. వెబ్సైట్: https://www.andhrauniversity.edu.in/
News November 8, 2025
వరి మాగాణుల్లో మొక్కజొన్న సాగు – కలుపు నివారణ

వరి మాగాణుల్లో మొక్కజొన్న విత్తాక కలుపు నివారణకు ఎకరాకు 200 లీటర్ల నీటిలో కిలో అట్రజిన్ 50% పొడి మందును కలిపి పంట విత్తిన 48 గంటలలోపు నేలంతా తడిచేట్లు పిచికారీ చేయాలి. వరి దుబ్బులు తిరిగి చిగురించకుండా 200 లీటర్ల నీటిలో లీటరు పారాక్వాట్ కలిపి విత్తే ముందు లేదా విత్తిన వెంటనే పిచికారీ చేయాలి. దీని వల్ల విత్తిన 20-25 రోజుల వరకు ఎలాంటి కలుపు రాదు. అట్రజిన్+పారాక్వాట్ కలిపి కూడా పిచికారీ చేయవచ్చు.


