News October 24, 2024

ALERT: భారీ వర్షాలు

image

AP: తూర్పు, మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ‘దానా’ తుఫాన్ ఏ క్షణమైనా తీవ్ర తుఫాన్‌గా బలపడే అవకావం ఉందని IMD తెలిపింది. దీని ప్రభావంతో ఇవాళ, రేపు ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని పేర్కొంది.

Similar News

News January 19, 2026

బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్

image

బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నితిన్ నబీన్‌ను ప్రతిపాదిస్తూ 37 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. రేపు ఉ.11 గంటలకు ఢిల్లీలోని పార్టీ ఆఫీసులో ప్రమాణ స్వీకారం చేసే అవకాశముంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరుకానున్నట్లు సమాచారం.

News January 19, 2026

WOW.. వైర్లు లేకుండానే విద్యుత్ సరఫరా!

image

వైర్లు లేకుండానే గాలిలో కరెంట్‌ను పంపి ఫిన్‌లాండ్ శాస్త్రవేత్తలు సంచలనం సృష్టించారు. హెల్సింకి, ఔలు యూనివర్సిటీల శాస్త్రవేత్తలు అల్ట్రాసోనిక్ ధ్వని తరంగాలు, లేజర్ కిరణాల సహాయంతో విద్యుత్తును ఒక చోటు నుంచి మరోచోటుకు విజయవంతంగా పంపారు. ప్రయోగాత్మక దశలో ఉన్న ఈ ‘అకౌస్టిక్ వైర్’ టెక్నాలజీ వల్ల ఫ్యూచర్‌లో ప్లగ్‌, వైర్ల అవసరం తగ్గుతుంది. Wi-Fi లాగే రేడియో తరంగాల ద్వారా పరికరాలకు విద్యుత్ సరఫరా అందనుంది.

News January 19, 2026

మళ్లీ పెరిగిన బంగారం ధర!

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు గంటల వ్యవధిలోనే <<18894920>>మళ్లీ<<>> పెరిగాయి. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర ఇవాళ మొత్తం రూ.2,460 పెరిగి రూ.1,46,240కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.2,250 ఎగబాకి రూ.1,34,050 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.8వేలు పెరిగి రూ.3,18,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలున్నాయి.