News September 6, 2024

ALERT: ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

image

AP: రుతుపవన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే 3 రోజుల్లో విస్తారంగా వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. కోస్తాంధ్రలో పలుచోట్ల భారీ వర్షాలు, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. నేడు శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, అల్లూరి, విశాఖ, కాకినాడ, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, అనకాపల్లి, అంబేడ్కర్, గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని పేర్కొంది.

Similar News

News February 4, 2025

టెన్త్ ప్రీఫైనల్.. ఏపీ, టీజీ షెడ్యూల్ ఇలా

image

APలో ఈ నెల 10 నుంచి 20వ తేదీ వరకు టెన్త్ క్లాస్ ప్రీఫైనల్ <<14926648>>పరీక్షలు<<>> నిర్వహించనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. లాంగ్వేజెస్, మ్యాథ్స్ ఉ.9.30-మ.12.45 వరకు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ పేపర్లకు ఉ.9.30-11.30 వరకు జరుగుతాయి. TGలో మార్చి 6 నుంచి 15 వరకు ప్రీఫైనల్ పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. మ.12.15-3.15 వరకు ఎగ్జామ్స్ జరుగుతాయి. పిల్లలకు మ.12.15లోపే భోజనం అందించాలని ఆదేశించారు.

News February 4, 2025

వచ్చే నెలాఖరు వరకు ఖరీఫ్ ధాన్యం సేకరణ

image

AP: ఖరీఫ్ ధాన్యం సేకరణ గడువును ప్రభుత్వం మార్చి నెలాఖరు వరకు పొడిగించింది. ఇప్పటి వరకు 31.52 లక్షల టన్నులను కొనుగోలు చేసినట్లు తెలిపింది. రైతుల ఖాతాల్లో రూ.7,222 కోట్లు జమ చేశామని వెల్లడించింది. మార్చి తర్వాత కూడా ధాన్యాన్ని కొనుగోలు చేయడంపై పరిశీలన చేస్తామంది. రైతుల పేరుతో వ్యాపారులు ధాన్యాన్ని విక్రయించాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

News February 4, 2025

అన్ని ఆఫీసుల్లో మరాఠీ తప్పనిసరి.. లేదంటే చర్యలు

image

మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని GOVT కార్యాలయాల్లో ఉద్యోగులంతా తప్పనిసరిగా మరాఠీలోనే మాట్లాడాలని ఆదేశాలు జారీ చేసింది. లేదంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. మరాఠీ భాష పరిరక్షణ, అభివృద్ధి కోసం ప్రజా వ్యవహారాల్లో ఈ భాషను ఉపయోగించాలని ప్రభుత్వ కమిటీ సిఫారసు చేసింది. కంప్యూటర్ కీ బోర్డుల్లోనూ మరాఠీ దేవనాగరి లిపి ఉండాలని పేర్కొంది. ఆ మేరకు GOVT చర్యలు ప్రారంభించింది.