News November 27, 2024
ALERT.. నేడు భారీ వర్షాలు
AP: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ ఇవాళ తుఫానుగా బలపడే అవకాశముందని APSDMA పేర్కొంది. దీని ప్రభావంతో నేటి నుంచి 4 రోజుల పాటు కోస్తాంధ్ర, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో భారీవర్షాలు కురుస్తాయని పేర్కొంది. మిగతా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అంచనా వేసింది.
Similar News
News November 27, 2024
చైతూ-శోభిత పెళ్లి.. ఆ వార్త ఫేక్!
నాగచైతన్య, శోభిత పెళ్లికి సంబంధించిన డిజిటల్ ప్రసార హక్కులను OTTకి విక్రయించినట్లు వస్తున్న వార్తలను అక్కినేని ఫ్యామిలీ సన్నిహిత వర్గాలు ఖండించాయి. ఈ వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశాయి. తమ వివాహ వేడుకను ప్రైవేటుగా నిర్వహించాలని చైతూ-శోభిత నిర్ణయించుకున్నట్లు తెలిపాయి. డిసెంబర్ 4న జరగనున్న వీరి పెళ్లి ప్రసార హక్కులను నెట్ఫ్లిక్స్కు రూ.50కోట్లకు విక్రయించినట్లు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.
News November 27, 2024
ఏపీలో భారీ ప్రాజెక్టులు.. భూమి కేటాయించిన ప్రభుత్వం
AP: అనకాపల్లి(D) నక్కపల్లి(M)లో ఆర్సెలార్ మిట్టల్-నిప్పన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ₹1,35,000కోట్లతో నిర్మించే ఈ ప్లాంట్ కోసం తొలి దశలో 2200 ఎకరాలు (ఎకరాకు ₹51.39లక్షలు) కేటాయించింది. దీనితో పాటు LG ఎలక్ట్రానిక్స్(తిరుపతి), ఫిలిప్స్ కార్బన్ బ్లాక్(నాయుడుపేట), ఆస్తా గ్రీన్ ఎనర్జీ వెంచర్స్(అన్నమయ్య/కడప) కంపెనీలకు భూములు కేటాయించింది.
News November 27, 2024
2025లో 8 మంది ఏపీ ఐఏఎస్ల రిటైర్మెంట్
ఏపీ క్యాడర్కు చెందిన 8 మంది ఐఏఎస్లు వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి నవంబర్ మధ్య రిటైర్ కానున్నారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ను సీఎస్ నీరబ్ తాజాగా జారీ చేశారు. ఈ లిస్టులో సుమితా దావ్రా, కె.హర్షవర్ధన్(మార్చి 31), కె.విజయానంద్ (నవంబర్ 30), జి.వాణీమోహన్ (ఫిబ్రవరి 28), KRBHN చక్రవర్తి, ఎం.హరి జవహర్ లాల్, ఎస్.సత్యనారాయణ(జూన్ 30), కె.శారదా దేవి (జులై 31) ఉన్నారు.