News June 3, 2024
ALERT.. ఇవాళ, రేపు భారీ వర్షాలు

TG: ఉపరితల ఆవర్తనం కారణంగా ఇవాళ, రేపు రాష్ట్రంలో భారీ <<13365571>>వర్షాలు<<>> కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ ఉమ్మడి ఖమ్మం, NLG, సూర్యాపేట, RR, VKB, MBNR, నాగర్కర్నూల్, వనపర్తి, గద్వాల్, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయంది. ఇక మిగతా జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 30-50కి.మీ గాలులతో కూడిన వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అటు 2 రోజుల్లో రుతుపవనాలు రాష్ట్రానికి రానున్నాయి.
Similar News
News January 22, 2026
ట్రంప్ ఎఫెక్ట్.. భారీ లాభాల్లో మార్కెట్లు

యూరప్ దేశాలపై టారిఫ్ల విషయంలో ట్రంప్ వెనక్కి తగ్గడంతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో దూసుకెళ్తున్నాయి. సెన్సెక్స్ 649 పాయింట్లు ఎగబాకి 82,559 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 196 పాయింట్లు పెరిగి 25,372 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్-30 సూచీలో అన్ని షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఎటర్నల్, ఏషియన్ పెయింట్స్, SBI, అదానీ పోర్ట్స్, BEL షేర్లు లాభాల్లో ఉన్నాయి.
News January 22, 2026
అప్పుడు అలాస్కా.. ఇప్పుడు గ్రీన్లాండ్: ఇలా కొనుక్కోవచ్చా?

అంతర్జాతీయ చట్టాల ప్రకారం పరస్పర ఒప్పందంతో ఇతర దేశాల భూభాగాలను కొనడం సాధ్యమే. 1867లో $7.2Mతో రష్యా నుంచి అలాస్కాను US కొనుగోలు చేసింది. ఇప్పుడు గ్రీన్లాండ్ విషయంలోనూ అలాంటి చర్చలే జరుగుతున్నాయి. గ్రీన్లాండ్ ప్రస్తుత విలువ సుమారు $700B పైమాటే. అయితే నేటి ఆధునిక చట్టాల ప్రకారం.. కేవలం డబ్బుతోనే కాకుండా ప్రభుత్వాల మధ్య అంగీకారం, స్థానిక ప్రజల ఆమోదం తప్పనిసరి. బలవంతపు ఆక్రమణకు UN రూల్స్ ఒప్పుకోవు.
News January 22, 2026
పెద్దవాళ్ల సబ్బునే పిల్లలకూ వాడుతున్నారా?

చిన్నపిల్లల చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. అందుకే వారికి వాడే ఉత్పత్తుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. అయితే చాలామంది పిల్లలకు సంవత్సరం దాటిన తర్వాత పెద్దవాళ్ల సబ్బులే వాడుతుంటారు. కానీ ఇది సరికాదంటున్నారు నిపుణులు. దీనివల్ల వారికి చిరాకు, అలర్జీ వచ్చే అవకాశముందంటున్నారు. పిల్లల ఉత్పత్తుల్లో పారబెన్స్, మినరల్ ఆయిల్స్, సల్ఫేట్స్ లేకుండా pH5.5% ఉండేలా చూసుకోవాలంటున్నారు.


