News August 17, 2024

ALERT.. రేపు భారీ వర్షాలు

image

తెలంగాణలోని పలు జిల్లాల్లో రేపు భారీ వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌లో భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మిగతా చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరించింది.

Similar News

News December 3, 2025

GHMCలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీల విలీనం

image

TG: గ్రేటర్ హైదరాబాద్‌లో 7 కార్పొరేషన్లు, 20 మున్సిపాలిటీల విలీనం పూర్తయింది. ఇది నిన్నటి నుంచే అమల్లోకి వచ్చినట్లు ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ORR వరకు, దానికి అవతలి వైపు ఆనుకొని ఉన్న ప్రాంతాలను GHMCలో విలీనం చేయాలని ఇటీవల ప్రభుత్వం క్యాబినెట్‌లో నిర్ణయించింది. దీనికి గవర్నర్ కూడా ఆమోదం తెలిపారు. ఈ విలీనం ద్వారా గ్రేటర్ హైదరాబాద్‌ దేశంలోనే అతిపెద్ద నగరంగా అవతరించింది.

News December 3, 2025

మార్క్రమ్ సెంచరీ.. ఔట్ చేసిన హర్షిత్‌

image

భారత్ నిర్దేశించిన 359 పరుగుల భారీ లక్ష్యం వైపు సాగుతున్న సౌతాఫ్రికాను హర్షిత్ రాణా దెబ్బ కొట్టారు. తొలి వన్డే ఆదిలోనే వికెట్లు తీసిన అతడు తాజాగా సెంచరీతో చెలరేగిన మార్క్రమ్‌ను వెనక్కి పంపారు. 110 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అతడిని పెవిలియన్ చేర్చారు. అంతకుముందు బవుమా 46, డీకాక్ 8 రన్స్ చేసి ఔట్ అయ్యారు. RSA 30 ఓవర్లలో 197/3 చేసింది. అర్ష్‌దీప్, ప్రసిద్ధ్, హర్షిత్ తలో వికెట్ తీశారు.

News December 3, 2025

ఏపీ న్యూస్ రౌండప్

image

⋆ రేపు తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో ఉ.11 గంటలకు YS జగన్‌ ప్రెస్ మీట్‌
⋆ శ్రీశైలంలో ఈ నెల 7 వరకు సాధారణ భక్తులకు స్పర్శ దర్శనం రద్దు.. ఇరుముడి కలిగిన శివస్వాములకు మాత్రమే ఉచిత స్పర్శ దర్శనం
⋆ వైఎస్ వివేకా హత్య కేసులో సమగ్ర దర్యాప్తు జరపాలని సునీత వేసిన పిటిషన్‌పై తీర్పు రిజర్వ్ చేసిన CBI కోర్టు.. ఈ నెల 10న తీర్పు
⋆ ఈ నెల 23న ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం ఎన్నికలు