News October 4, 2025

ALERT: రేపు భారీ వర్షాలు

image

తెలంగాణలోని 10 జిల్లాల్లో రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్, ఖమ్మం, సూర్యాపేటలోని పలు ప్రాంతాల్లో భారీ వానలు పడతాయని అంచనా వేసింది. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది.

Similar News

News October 5, 2025

ఆలస్యం చేస్తే ఊరుకోను.. ట్రంప్ వార్నింగ్

image

తన ప్రకటనపై హమాస్ వేగంగా స్పందించాలని అమెరికా అధ్యక్షుడు <<17906657>>ట్రంప్ హెచ్చరించారు<<>>. ‘బందీలను విడుదల చేసేందుకు, శాంతి ఒప్పందాన్ని అమలు చేసేందుకు తాత్కాలికంగా బాంబింగ్ ఆపినందుకు ఇజ్రాయెల్‌ను అభినందిస్తున్నా. హమాస్ వైపు నుంచి ఏదైతే జరుగుతుందని అందరూ భావిస్తున్నారో అలాంటి ఆలస్యాన్ని నేను సహించను. బందీలను విడుదల చేసే ప్రక్రియను త్వరగా పూర్తి చేయండి. అందరితో న్యాయంగా వ్యవహరిస్తాం’ అని SMలో పోస్ట్ చేశారు.

News October 5, 2025

దసరా స్పెషల్.. ఆర్టీసీకి ₹110 కోట్ల ఆదాయం

image

దసరా నేపథ్యంలో ₹110 కోట్ల ఆదాయం సమకూరినట్లు TGSRTC తెలిపింది. 7,754 స్పెషల్ బస్సులు తిప్పాలని నిర్ణయించినా ప్రయాణికులు లేకపోవడంతో 5,300 బస్సులే నడిపినట్లు వెల్లడించింది. గతేడాది 6,300 ప్రత్యేక బస్సులు వేయగా ₹114 కోట్ల ఆదాయం వచ్చిందని పేర్కొంది. ఈసారి సొంతూళ్లకు వెళ్లేవారి సంఖ్య తగ్గడం, ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించడంతో ఆదాయం తగ్గినట్లు వివరించింది. కాగా ఇవాళ, రేపు బస్సుల్లో రద్దీ పెరిగే ఛాన్స్ ఉంది.

News October 4, 2025

బిగ్‌బాస్-9: ఈవారం ఎలిమినేట్ ఎవరంటే?

image

బిగ్‌బాస్ సీజన్-9 రసవత్తరంగా సాగుతోంది. ఈ వారం రీతూ, ఫ్లోరా, సంజన, శ్రీజ, హరిత హరీశ్, దివ్య నామినేషన్‌లో ఉన్నారు. ఈ నాలుగో వారంలో దమ్ము శ్రీజ ఎలిమినేట్ అవుతుందని అంతా భావించారు. కానీ ఆమె ఓటింగ్‌లో సేవ్ అయ్యారు. తక్కువ ఓటింగ్ పర్సంటేజ్‌తో మాస్క్ మ్యాన్ హరిత హరీశ్ ఎలిమినేట్ అయినట్లు సమాచారం. ఈ ఎపిసోడ్ రేపు టెలికాస్ట్ కానుంది. మోనార్క్‌లా వ్యవహరించడం, టాస్క్‌లు ఆడకపోవడమే హరీశ్‌‌కు మైనస్ అయింది.