News August 16, 2024
ALERT: ఇయర్ ఫోన్స్ ఎంతసేపు వాడుతున్నారు?

ఇయర్ ఫోన్స్ అతి వాడకంతో వినికిడిలోపం ఏర్పడే ప్రమాదం ఉందని US ఆస్టియోపతిక్ అసోసియేషన్ వెల్లడించింది. ఇయర్ ఫోన్స్ నుంచి 60% సౌండ్ మాత్రమే వినాలని, అది కూడా రోజుకు 60ని.లకు మించవద్దంది. 100% వాల్యూమ్‌తో అయితే 5ని.లకు మించి వాడవద్దని చెబుతోంది. ఇయర్ ఫోన్స్, ఇయర్ బడ్, బ్లూటూత్ వంటివి కర్ణభేరికి అతి దగ్గరగా ఉంటాయి. వీటి వల్ల వినికిడి సమస్యలతో పాటు చెవిలోకి ఫంగస్, బాక్టీరియాలు చేరే ప్రమాదం ఉంటుంది.
Similar News
News February 14, 2026
IND vs PAK: రేపు ‘మహా’ సంగ్రామం.. ఇప్పటి వరకు మనదే జోరు!

T20 WCలో IND vs PAK మధ్య ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు జరగ్గా 7-1తో మనదే ఆధిపత్యం. 2007 ‘బౌల్ అవుట్’ విక్టరీ నుంచి 2024 ‘న్యూయార్క్ లో-స్కోరింగ్ థ్రిల్లర్’ వరకు భారత్ తన సత్తాను చాటుతూనే ఉంది. విరాట్ కోహ్లీ మెల్బోర్న్ మిరాకిల్ (2022), బుమ్రా డెత్ ఓవర్ల మ్యాజిక్ (2024) వంటి మధుర జ్ఞాపకాలతో భారత్ ఆధిపత్యం కొనసాగుతోంది. రేపటి మ్యాచ్‌లోనూ దాయాదుల పోరు ఆసక్తికరంగా సాగనుంది. IND విజయాల ఫొటోలను పైన చూడొచ్చు.
News February 14, 2026
నేలలో అధిక తేమ వల్ల పంటల్లో కనిపించే సమస్యలు

నేలలో అధిక తేమ వల్ల కూరగాయల తోటల్లో నారుకుళ్లు, మొక్క ఎదుగుదల తగ్గటం, పూతరాలటం, ఎండు తెగులు, ఆకుమచ్చ తెగులు, కాయకుళ్లు, ఆకులు పసుపుబారటం, అక్షింతల పురుగు, బ్యాక్టీరియా ముచ్చ తెగులు, బూడిద తెగులు.. ఆకుకూరల్లో మొక్క మొదలుకుళ్లు, ఆకుతినే పురుగు, ఆకుమచ్చ తెగులు వస్తాయి. దుంప జాతుల్లో దుంప కుళ్లు, అధిక శాఖీయోత్పత్తి సమస్యలు కనిపిస్తాయి. బత్తాయి, నిమ్మ, ద్రాక్ష, జామ, మామిడిలో అధిక తేమ ప్రభావం ఎక్కువ.
News February 14, 2026
ఇందిరాగాంధీ నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీలో ఫ్యాకల్టీ పోస్టులు

<


