News September 10, 2024
ALERT: దీనిపై క్లిక్ చేస్తే బ్యాంక్ అకౌంట్ హ్యాక్!

కష్టపడి సంపాదించిన సొమ్మును సైబర్ నేరగాళ్లు లూటీ చేస్తున్నారు. తాజాగా HDFC బ్యాంక్ అధికారులమంటూ నేరగాళ్లు వాట్సాప్లో మెసేజ్లు పంపిస్తున్నారు. APK ఫైల్ పంపించి ఇన్స్టాల్ చేయాలని సూచిస్తున్నారు. తెలియక దానిపై క్లిక్ చేయగానే బ్యాంక్ అకౌంట్ హ్యాక్ అయి అందులోని డబ్బులు ఖాళీ అవుతున్నాయి. తాజాగా ఓ వ్యక్తి రూ.74వేలు పోగొట్టుకున్నాడు. ఇలాంటి APKఫైల్స్ను అస్సలు ఓపెన్ చేయకండి. SHARE IT
Similar News
News November 13, 2025
శుభ సమయం (13-11-2025) గురువారం

✒ తిథి: బహుళ నవమి తె.3.31 వరకు
✒ నక్షత్రం: మఖ రా.12.15 వరకు
✒ శుభ సమయాలు: లేవు
✒ రాహుకాలం: మ.1.30-మ.3.00
✒ యమగండం: ఉ.6.00-ఉ.7.30
✒ దుర్ముహూర్తం: ఉ.10.00-ఉ.10.48, మ.2.48-మ.3.36
✒ వర్జ్యం: మ.12.13-మ.1.49
✒ అమృత ఘడియలు: రా.9.49-రా.11.25
News November 13, 2025
Today Headlines

*ఢిల్లీ పేలుడు ఉగ్రదాడేనన్న కేంద్ర క్యాబినెట్.. కారకులను చట్టం ముందు నిలబెడతామని తీర్మానం
*ప్రభుత్వ వైఫల్యం వల్లే పేలుడు: ఖర్గే
*3 లక్షల ఇళ్ల గృహప్రవేశాలకు సీఎం చంద్రబాబు శ్రీకారం
*మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై వైసీపీ రాష్ట్రవ్యాప్త నిరసనలు
*రిగ్గింగ్ చేయడం సాధ్యం కాదన్న TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
*UPSC సివిల్స్ మెయిన్స్ ఫలితాలు విడుదల
News November 13, 2025
బ్లాస్ట్ చేసిన వారికే కాంగ్రెస్ సపోర్ట్: బీజేపీ

ఢిల్లీ బ్లాస్ట్ కారకులకు కాంగ్రెస్ సపోర్ట్ చేస్తోందని BJP మండిపడింది. ఎన్నికల సమయంలోనే ఉగ్రవాద దాడులు జరగడానికి కారణమేంటని సిద్దరామయ్య ప్రశ్నించడంపై ఫైర్ అయింది. సిద్దరామయ్య, ఇతర కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమని, వారివి దిగజారుడు రాజకీయాలని BJP కర్ణాటక చీఫ్ విజయేంద్ర మండిపడ్డారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని పార్టీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ విమర్శించారు.


