News September 26, 2024
తిరుపతిలో అలర్ట్.. పోలీసుల ఆంక్షలు

AP: శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా తిరుపతి జిల్లాలో అక్టోబర్ 24 వరకు సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలు చేయనున్నట్లు ఎస్పీ సుబ్బరాయుడు ప్రకటించారు. ముందస్తు అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ఊరేగింపులు నిర్వహించొద్దని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రేపు మాజీ సీఎం వైఎస్ జగన్ తిరుమలకు వెళ్లనున్న వేళ ఈ ఆంక్షలు అమల్లోకి తేవడంతో ఏం జరగనుందనే ఉత్కంఠ నెలకొంది.
Similar News
News November 9, 2025
మాది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం: అనగాని

AP: తమది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం అని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఏ పని ఉన్నా అది రెవెన్యూ ఉద్యోగుల వల్లే సాధ్యమన్నారు. ‘గతంలో ఉద్యోగులను ఇబ్బందులు పెట్టారు. YCP ప్రభుత్వం భూమి సమస్యలు సృష్టించింది. కూటమి ప్రభుత్వం వచ్చాక గ్రామ సభల ద్వారా ఆ సమస్యలు పరిష్కరించాం’ అని అనంతపురం జిల్లా పర్యటనలో అన్నారు. మరోవైపు రాష్ట్రాభివృద్ధికి రెవెన్యూశాఖ పాత్ర కీలకం అని మరో మంత్రి పయ్యావుల చెప్పారు.
News November 9, 2025
‘ఎలుకల దాడి’పై మంత్రి సత్యకుమార్ సీరియస్

AP: ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులను ఎలుకలు కరవడంపై మంత్రి సత్యకుమార్ తీవ్రంగా స్పందించారు. హాస్టల్ వార్డెన్, నిర్వహణ బాధ్యతలు చూస్తున్న ప్రైవేటు ఏజెన్సీకి నోటీసులు జారీ చేయాలని DME రఘునందన్ను ఆదేశించారు. హాస్టల్ వార్డెన్ వివరణ కోరుతూ మెమో ఇవ్వాలని కాలేజీ ప్రిన్సిపల్ను ఆదేశించారు. కాగా హాస్టల్లోని పరిస్థితులపై తనిఖీ చేస్తున్నామని డీఎంఈ మంత్రికి తెలియజేశారు.
News November 9, 2025
తాజా వార్తలు

☛ పేదరికం లేని సమాజమే నా లక్ష్యం. సంజీవని పథకం ద్వారా ఇంటి దగ్గరే వైద్యం అందిస్తాం. గ్రామాల్లో 5వేల వేంకటేశ్వర స్వామి ఆలయాలు నిర్మిస్తాం: CM చంద్రబాబు
☛ యాదగిరిగుట్టకు రూ.1,00,57,322 రికార్డ్ ఆదాయం. ఇవాళ ఆలయాన్ని దర్శించుకున్న 78,200మంది భక్తులు
☛ బిహార్లో మరోసారి ఎన్డీయేదే అధికారం: మంత్రి లోకేశ్
☛ నిన్నటి దాకా CM రేసులో భట్టి ఉండేవారు. ఇప్పుడు మహేశ్ కుమార్ గౌడ్ కూడా వచ్చారు: జగదీశ్ రెడ్డి


