News January 11, 2025

ALERT.. పెరగనున్న చలి తీవ్రత

image

TG: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం మరో 4 రోజులు కొనసాగనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో చలి తీవ్రత మరింత పెరగనున్నట్లు తెలిపింది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలకు దిగువన నమోదవుతున్నాయని పేర్కొంది. కొమురం భీం(D) తిర్యాణీలో 6.8, ఆదిలాబాద్(D) భీంపూర్‌లో 7, నిర్మల్(D) పెంబీలో 9.1, సంగారెడ్డి(D) న్యాల్‌కల్‌లో 9.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపింది.

Similar News

News January 11, 2025

ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో జడేజా డౌట్?

image

ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో ఆల్‌రౌండర్ జడేజా స్థానంపై సందిగ్ధం నెలకొంది. అతడిని జట్టులోకి తీసుకోవాలా? భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని జూనియర్లకు చోటు కల్పించాలా? అనే దానిపై BCCI ఆలోచిస్తున్నట్లు క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఆల్‌రౌండర్‌కు అక్షర్, దూబే, సుందర్ నుంచి పోటీ ఉంది. CTలో భారత్ దుబాయ్‌లో స్పిన్ పిచ్‌లపై ఆడుతుండటంతో అనుభవమున్న ప్లేయర్ కావాలని భావిస్తే జడేజాను ఎంపిక చేసే ఛాన్స్ ఉంది.

News January 11, 2025

సుంకిశాల ఘటనపై విజిలెన్స్ నివేదికను బహిర్గతం చేయాలి: KTR

image

TG: సుంకిశాలలో మేఘా సంస్థ నిర్లక్ష్యం వల్ల రిటైనింగ్‌వాల్‌ కూలి ₹80cr ప్రజాధనానికి నష్టం వాటిల్లిందని KTR అన్నారు. ఆ సంస్థకు, మంత్రి పొంగులేటికి చెందిన రాఘవ కంపెనీకి ₹4,350cr కొడంగల్‌ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టును పంచిపెట్టి భారీ స్కామ్‌కు తెరతీశారని ఆరోపించారు. సుంకిశాల ఘటనపై విజిలెన్స్ నివేదికను సమాచార హక్కు చట్టం కింద ఇవ్వకుండా తొక్కిపెడుతున్నారని, ఆ నివేదికను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.

News January 11, 2025

వారికి నెలకు రూ.2లక్షల జీతం

image

AP: క్యాబినెట్ హోదా ఉన్న వారికి నెలకు రూ.2 లక్షల జీతం అందించనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. జీతంతో పాటు కార్యాలయ ఫర్నీచర్‌ ఏర్పాటుకు వన్‌టైం గ్రాంట్, వ్యక్తిగత సహాయ సిబ్బంది అలవెన్స్‌లు, ఇతర సౌకర్యాల కోసం మరో రూ.2.50 లక్షలు చెల్లించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. అంటే క్యాబినెట్ ర్యాంకు ఉన్నవారికి నెలకు మొత్తం రూ.4.50 లక్షలు అందనున్నాయి.