News August 14, 2024
ALERT: వాహనానికి జాతీయ జెండా పెట్టారా?

ప్రతి ఒక్కరూ ఇంటిపై జాతీయ జెండాను ఏర్పాటుచేసే హక్కు ఉంది. కానీ, వాహనాలపై జెండాను పెట్టే హక్కు కొందరికే ఉంది. <
Similar News
News October 22, 2025
పాక్ ఘోర ఓటమి.. WWC నుంచి ఎలిమినేట్

WWCలో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచులో పాకిస్థాన్ 150 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. వర్షం కారణంగా మ్యాచును 40 ఓవర్లకు కుదించగా సౌతాఫ్రికా 9 వికెట్లు కోల్పోయి 312 పరుగులు చేసింది. ఛేదనలోనూ వర్షం కురవడంతో పాక్ లక్ష్యాన్ని 20 ఓవర్లలో 234గా అంపైర్లు నిర్దేశించారు. ఏ దశలోనూ గెలుపు దిశగా పయనించని పాక్ 20 ఓవర్లలో 83 పరుగులే చేసింది. ఈ ఓటమితో WWC నుంచి నిష్క్రమించింది. ఇప్పటికే బంగ్లాదేశ్ ఎలిమినేట్ అయింది.
News October 22, 2025
వైట్‌హౌస్‌లోకి బుల్డోజర్లు.. కారణమిదే!

వరుస వివాదాలు చుట్టుముడుతున్నా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెనక్కి తగ్గడం లేదు. తాజాగా వైట్‌హౌస్‌లోని ఈస్ట్ వింగ్‌లో కొంతభాగాన్ని బుల్డోజర్లతో కూలగొట్టిస్తున్నారు. తన బాల్రూమ్ ప్రాజెక్టు ($250M) కోసం ఆయన ఇలా చేస్తున్నారు. కూల్చివేతల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా అధికారిక విందులు, సమావేశాలు, నృత్య కార్యక్రమాలు నిర్వహించేందుకు ఉపయోగించే పెద్ద గదినే బాల్రూమ్/బాల్‌హాల్ అంటారు.
News October 22, 2025
TATA RECORD: 30 రోజుల్లో లక్ష కార్ల డెలివరీ

ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ రికార్డు సృష్టించింది. నవరాత్రి నుంచి దీపావళి వరకు 30 రోజుల్లో లక్షకు పైగా కార్లను డెలివరీ చేసినట్లు ప్రకటించింది. గతేడాది ఇదే పీరియడ్‌తో పోలిస్తే 33% వృద్ధి సాధించినట్లు వెల్లడించింది. అత్యధికంగా నెక్సాన్ 38వేలు, పంచ్ 32వేల యూనిట్లను విక్రయించామని తెలిపింది. అలాగే 10వేలకు పైగా EVలను అమ్మినట్లు పేర్కొంది. జీఎస్టీ 2.0, పండుగలు కలిసొచ్చినట్లు వివరించింది.