News September 10, 2025

ALERT: ఈ-క్రాప్ బుకింగ్‌కు ఈ నెల 30 లాస్ట్

image

APలో ఈ-క్రాప్ బుకింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అందించే రాయితీలు, సున్నావడ్డీ రుణాలు, ఇన్‌పుట్ సబ్సిడీ, పంటల కొనుగోలు, ఇతర సంక్షేమ పథకాలకు ఈ డేటానే ప్రామాణికం. అందువల్ల అన్నదాతలు ఈ నెల 30లోగా ఈ-క్రాప్ బుకింగ్ పూర్తిచేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇందుకోసం ఆధార్ కార్డు, భూమి, బ్యాంక్ పాస్‌బుక్‌ జిరాక్సులు, 1B తీసుకుని మండల వ్యవసాయ అధికారిని సంప్రదించాలి.

Similar News

News March 12, 2026

ఈ నెలలోనే రైతు భరోసా: మంత్రి వివేక్

image

TG: ‘రైతు భరోసా’ నిధుల విడుదల కోసం ఎదురుచూస్తున్న అన్నదాతలకు మంత్రి వివేక్ శుభవార్త చెప్పారు. ఈ నెల నుంచే రైతు భరోసా పంపిణీ చేయనున్నట్లు చెన్నూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో వెల్లడించారు. రైతు భరోసా కింద మొత్తం రూ.9,000కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు పేర్కొన్నారు. మార్చిలో తొలి విడతగా రూ.4,500కోట్లు, మిగతావి వచ్చే నెలలో రిలీజ్ చేస్తామని స్పష్టం చేశారు.

News March 12, 2026

ప్రభుత్వ ఆఫీసుల్లో సర్టిఫికెట్లు అడగొద్దు: CM

image

AP: ప్రభుత్వాఫీసుల్లో ప్రజల నుంచి సర్టిఫికెట్లు తీసుకోవడం ఆపాలని, ప్రస్తుత రోజుల్లో అది ఆమోదయోగ్యం కాదని CM CBN అన్నారు. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ద్వారా సర్టిఫికెట్లను డిజిటల్ వెరిఫికేషన్ చేయాలని అధికారులకు సూచించారు. విద్యార్థులు, ఉద్యోగార్థులు సర్టిఫికెట్లతో తిరిగే అవసరం ఉండకూడదని స్పష్టం చేశారు. సర్టిఫికెట్లు ఇచ్చేది ప్రభుత్వమే కావున వాటిని అన్ని శాఖలు చూడగలిగేలా సాఫ్ట్‌వేర్‌ను వాడుకోవాలన్నారు.

News March 12, 2026

డొమెస్టిక్ సిలిండర్లను కమర్షియల్‌కు వాడొద్దు: సివిల్ సప్లై కమిషనర్

image

TG: డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను కమర్షియల్ అవసరాలకు వాడొద్దని సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర సూచించారు. కృత్రిమ కొరత సృష్టించినా, అక్రమంగా నిల్వ చేసినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్యాస్ అక్రమ వినియోగంపై టోల్ ఫ్రీ నంబర్ల(1967, 180042500333)కు ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఇప్పటివరకు జరిగిన తనిఖీల్లో ₹2.36L విలువైన సిలిండర్లను పట్టుకున్నామని, రాష్ట్రవ్యాప్తంగా 7 కేసులు నమోదయ్యాయని చెప్పారు.