News January 8, 2025

ALERT.. ఇవాళ రాత్రి కనిష్ఠ ఉష్ణోగ్రతలు

image

TG: ఇవాళ రాత్రి ఉష్ణోగ్రతలు ఈ నెలలోనే కనిష్ఠానికి పడిపోతాయని తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. రేపు ఉదయం నార్త్ HYDలో 5-7 డిగ్రీ సెల్సియస్, వెస్ట్ HYDలో 7-9 డిగ్రీ సెల్సియస్ నమోదవుతుందని తెలిపారు. గత కొన్ని రోజులుగా తెలంగాణలోని ఇతర జిల్లాల్లోనూ కనిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి.

Similar News

News December 16, 2025

BBCపై పరువునష్టం దావా వేస్తా: ట్రంప్

image

ప్రముఖ మీడియా సంస్థ BBCపై పరువునష్టం దావా వేయనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. గత అధ్యక్ష ఎన్నికల సమయంలో 2021 జనవరి 6న క్యాపిటల్‌ హిల్‌ ఘటనకు ముందు చేసిన తన ప్రసంగాన్ని BBC తప్పుడు అర్థం వచ్చేలా ప్రసారం చేసిందని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను బీబీసీ ఛైర్మన్ సమీర్ షా ఖండిస్తూ ట్రంప్‌కు క్షమాపణ లేఖ పంపారు. గతంలోనూ పలు మీడియా సంస్థలపై ట్రంప్ పరువునష్టం దావా వేశారు.

News December 16, 2025

బాలయ్య నోట మరో పాట.. సాహోరే బాహుబలి తరహాలో!

image

నందమూరి బాలకృష్ణ తన తర్వాతి సినిమా కోసం మరోసారి సింగర్‌గా మారబోతున్నారు. ఈ విషయాన్ని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ వెల్లడించారు. సాహోరే బాహుబలి సాంగ్ తరహాలో ఈ పాట ఉంటుందని తెలిపారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఈ మూవీ రాబోతోంది. కాగా బాలయ్య గతంలో ‘పైసా వసూల్’ సినిమాలో ‘మామా ఏక్ పెగ్ లా’ అనే సాంగ్ పాడారు. అప్పుడప్పుడూ మూవీ ఈవెంట్లలోనూ ఆయన తన సాంగ్స్ పాడి ప్రేక్షకులను అలరిస్తుంటారు.

News December 16, 2025

బేబీ వెయిట్ పెరగడానికి ఏం చేయాలంటే?

image

గర్భంలో పిండం బరువు ఎందుకు పెరగట్లేదో ముందుగా తెలుసుకొని దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. బేబీ ఊపిరితిత్తులు సరిగా లేకపోతే ఇంజక్షన్లు తీసుకోవడం తప్పనిసరి. డాక్టర్లు సూచించిన స్కాన్‌లు ఎప్పటికప్పుడు చేసుకుంటూనే వేరుశెనగలు, రాజ్మా, మిల్క్, ఎగ్స్, మాంసం, పప్పులు, పనీర్ వంటి ప్రొటీన్ రిచ్ ఫుడ్స్, ఆకుకూరలు ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు.