News January 31, 2025

ALERT.. రేపటి నుంచి కొత్త రూల్స్

image

☞ UPI పేమెంట్లలో <<15306489>>ప్రత్యేక అక్షరాలతో<<>> ఐడీ ఉంటే వారు పేమెంట్స్ చేయలేరు. కేవలం ఆల్ఫా-న్యూమరిక్ ఉన్న IDలే చెల్లుబాటు అవుతాయి.
☞ IMPS ద్వారా రోజుకు రూ.10లక్షలు బదిలీ చేయవచ్చు
☞ మారుతీ కార్ల ధరలు పెరుగుతాయి
☞ NPS కింద పాక్షిక ఉపసంహరణ పరిమితి 30శాతానికి పెరగనుంది
☞ కొటక్ మహీంద్ర ATM లావాదేవీల్లో పరిమితి విధింపు
☞☞ LPG సిలిండర్ ధరల్లో మార్పులు

Similar News

News December 6, 2025

చంద్రబాబూ.. గంగిరెద్దులా తలూపొద్దు: అనంత వెంకటరామిరెడ్డి

image

రైతాంగాన్ని ఆదుకునే విషయంలో కేంద్రంతో పోరాడాల్సిన చంద్రబాబు.. రైతులను పణంగా పెట్టి తన పాత కేసులను మాఫీ చేసుకుంటున్నారని వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఉందంటే అది ఇక్కడి ఎంపీల వల్లేనని గుర్తు చేశారు. ఒక్క వార్నింగ్‌ ఇస్తే కేంద్రం దిగి వస్తుందని, కానీ చంద్రబాబు మాత్రం తన స్వప్రయోజనాల కోసం కేంద్రం వద్ద గంగిరెద్దులా తలూపుతున్నారని మండిపడ్డారు.

News December 6, 2025

రూపాయి తన స్థాయిని తానే కనుగొంటుంది: నిర్మల

image

రూపాయి పతనంపై కేంద్ర మంత్రి నిర్మల స్పందించారు. రూపాయి తన స్థాయిని తానే కనుగొంటుందని అన్నారు. ఈ పతనం ప్రతికూలం కాదని, ఎగుమతిదారులకు ప్రయోజనకరమని చెప్పారు. ‘రూపాయి, కరెన్సీ ఎక్స్ఛేంజ్ రేట్ల వంటివి చాలా సెన్సిటివ్ అంశాలు. మేం ప్రతిపక్షంలో ఉండగా నిరసనలు చేశాం. కానీ అప్పట్లో ద్రవ్యోల్బణం ఎక్కువగా, ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉండేది. ఇప్పుడు ఎకానమీ ఏ పొజిషన్‌లో ఉందో చూడండి’ అని HT సమ్మిట్‌లో అన్నారు.

News December 6, 2025

కూరగాయ పంటల్లో వైరస్ తెగుళ్ల లక్షణాలు(1/2)

image

వైరస్ ఆశించిన కూరగాయల మొక్కల్లో లేత ఆకులు చిన్నగా, పసుపు రంగుకు మారి పాలిపోయినట్లు కనిపిస్తాయి. కొన్ని మొక్కల్లో ఆకులపై అక్కడక్కడ పసుపురంగు మచ్చలు కనిపిస్తాయి. ఆకులపై పసుపు చారలు ఏర్పడి, గిడసబారి ఉంటాయి. ఆకుల ఈనెల మధ్యభాగం మందంగా ఉండి పెళుసుగా ఉంటాయి. ఆకుల ఈనెలతో సహా పసుపు రంగులోకి మారి గిడసబారతాయి. మొక్క చివరి ఆకులు ఎండి, చనిపోయినట్లుగా ఉంటాయి.