News May 4, 2024
ALERT: సైబర్ నేరగాళ్ల కొత్త మోసం

సైబర్ నేరగాళ్లు ‘మనీ స్వైపింగ్’ పేరిట కొత్త మోసానికి తెర తీశారు. ఈ స్కామ్ గురించి ఓ మహిళ Xలో పోస్ట్ చేశారు. ‘మా నాన్నకు డబ్బు ఇవ్వాల్సి ఉందని ఓ వ్యక్తి కాల్ చేశారు. కాల్‌లో ఉండగానే నా ఖాతాలో డబ్బులు జమైనట్లు SMS వచ్చింది. అవతలి వ్యక్తి ₹3వేలకు బదులు ₹30వేలు పంపాను. వెంటనే మిగతా డబ్బు తిరిగి పంపమన్నాడు. SMSను పరిశీలిస్తే అది బ్యాంకు నుంచి కాదు, ఫోన్ నంబర్ నుంచి వచ్చిందని గ్రహించాను’ అని తెలిపారు.
Similar News
News March 15, 2026
అభిషేక్, నేను అగ్ని లాంటోళ్లం: సంజు శాంసన్

అభిషేక్ శర్మ, తాను ఐస్-ఫైర్‌లా ఉండమని, తాము కలిస్తే అగ్నికి అగ్ని తోడైనట్లేనని సంజూ శాంసన్ అన్నారు. ‘ఓపెనింగ్‌లో కొన్నిసార్లు నేను, ఇంకొన్నిసార్లు అభిషేక్ దూకుడుగా ఆడాం. 2024 నుంచి ఇదే చేస్తున్నాం’ అని ఇండియా టుడే కాంక్లేవ్‌లో చెప్పారు. ఇంతకుముందు అభిషేక్ ఫాలోయింగ్‌ను చూసి అసూయపడేవాళ్లమని పేర్కొన్నారు. జట్టులో అతడో సూపర్ స్టార్ అని, త్వరగా పెళ్లి చేసుకోవాలని జోక్ చేశారు.
News March 15, 2026
తిరుమల వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్!

తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు మరిన్ని సౌకర్యాలను TTD అందుబాటులోకి తీసుకొస్తోంది. వసతి గృహాల్లో దిండు, దుప్పటి, చాప, బెడ్‌షీట్‌లను ఇవ్వనుంది. తొలుత నందకంలో ఇవ్వడం ప్రారంభించగా భక్తుల నుంచి సానుకూల స్పందన వచ్చింది. దీంతో వకుళామాత, పాంచజన్యం, కౌస్తుభం తదితర గెస్ట్‌హౌసుల్లోనూ అందజేయాలని నిర్ణయించింది. దుప్పటి-₹10, 2 దిండ్లు-₹10, చాప-₹10, బెడ్‌షీట్-₹20 చొప్పున చెల్లించి తీసుకోవచ్చు.