News May 1, 2024

ALERT: వారికి నేటి నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు

image

దేశంలోని కీలక బ్యాంకులైన ICICI, ఎస్ బ్యాంక్ సేవింగ్స్ ఖాతా సర్వీస్ ఛార్జీలను సవరించాయి. సేవింగ్స్ అకౌంట్ లావాదేవీలు, చెక్ బుక్ జారీ, IMPS ట్రాన్స్‌ఫర్స్, డెబిట్ రిటర్న్‌ల ఛార్జీలు పెంచుతూ ICICI నిర్ణయం తీసుకుంది. ఎస్ బ్యాంకు కూడా సేవింగ్స్ అకౌంట్ ఛార్జీలను సవరించింది. మినిమం బ్యాలెన్స్, ఏటీఎం, డెబిట్ కార్డు ఫీజు, క్రెడిట్ కార్డు ఛార్జీలను పెంచింది. నేటి నుంచే ఇవి అమల్లోకి రానున్నాయి.

Similar News

News December 29, 2024

నితీశ్ కుమార్ రెడ్డిపై పవన్ కళ్యాణ్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

image

నితీశ్ కుమార్ రెడ్డి తెలుగువాడైనందుకు గర్వంగా ఉందని చాలా మంది పోస్టులు పెడుతుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘నువ్వు “భారత్”లోని ఏ ప్రాంతం నుంచి వచ్చావనే దానికంటే దేశం గర్వించేలా ఏం చేశావన్నదే ముఖ్యం. ఇలాంటి వరల్డ్ క్లాస్ రికార్డులెన్నో సాధించాలని కోరుకుంటున్నా. భారత జెండాను ఉన్నతస్థాయికి తీసుకెళ్లి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలవాలి’ అని ట్వీట్ చేశారు.

News December 29, 2024

₹12 కోట్ల ఘ‌రానా మోసం.. నిందితుల అరెస్టు

image

CRED యాప్‌ను ప‌ర్య‌వేక్షించే Dreamplug Paytech Solutions బ్యాంకు ఖాతాల నుంచి ₹12 కోట్లు లూటీ చేసిన న‌లుగురు నిందితుల‌ను బెంగ‌ళూరు సైబ‌ర్ సెల్ పోలీసులు అరెస్టు చేశారు. Axis బ్యాంకు రిలేష‌న్‌షిప్ మేనేజ‌ర్ వైభ‌వ్ పిథాడియా బ్యాంకు, ఇన్సూరెన్స్ ఏజెంట్ల‌తో క‌లిసి క్రెడెన్షియల్స్ మార్పు, త‌ప్పుడు ప‌త్రాల‌తో Dreamplug ఖాతాల యాక్సెస్ పొందారు. 37 లావాదేవీల ద్వారా ₹12.20 కోట్ల‌ను ఇత‌ర ఖాతాల‌కు మ‌ళ్లించారు.

News December 29, 2024

పోలీసుల మరణ మృదంగం.. ప్రభుత్వానికి పట్టింపు లేదా?: హరీశ్ రావు

image

TGలో ఇటీవల పోలీసుల వరుస ఆత్మహత్య ఘటనలపై హరీశ్ రావు తీవ్రంగా స్పందించారు. పోలీసుల మరణ మృదంగంపై ప్రభుత్వానికి పట్టింపు లేదా? అని ప్రశ్నించారు. ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన పోలీసులే ప్రాణాలు కోల్పోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు. పలు అంశాల్లో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వారిపై ప్రభావం చూపిస్తోందన్నారు. పోలీసులకు సూసైడ్ ఆలోచనలు రాకుండా సైకాలజిస్టులతో కౌన్సెలింగ్ నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు.