News May 23, 2024
ALERT: అలాంటి స్కీమే లేదు

లోక్‌సభ ఎన్నికల వేళ కేంద్ర ప్రభుత్వం 50-86 ఏళ్లలోపు సీనియర్ సిటిజన్లకు ఉచితంగా ఆరోగ్య బీమాను అందిస్తున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ మెసేజ్ ఫేక్ అని కేంద్ర ప్రభుత్వానికి చెందిన PIB FACTCHECK పేర్కొంది. ఇలాంటి స్కీమ్‌ను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ అమలు చేయట్లేదని స్పష్టం చేసింది. ఇలాంటివి నమ్మి సైబర్ నేరగాళ్ల వలలో పడొద్దని సూచించింది.
Similar News
News February 21, 2026
సూపర్-8 సమరం ఇవాళ్టి నుంచే!

T20 WCలో లీగ్ దశ ముగిసింది. ఇవాళ్టి నుంచి సూపర్-8 సమరం మొదలుకానుంది. మొత్తం 8 టీమ్స్‌లో టాప్-4 సెమీ ఫైనల్స్‌కు చేరుకుంటాయి. నేటి రాత్రి 7 గంటలకు కొలంబో వేదికగా న్యూజిలాండ్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఇక రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఇంగ్లండ్, శ్రీలంక, రాత్రి 7 గంటలకు ఇండియా, సౌతాఫ్రికా మ్యాచులు జరగనున్నాయి.

ఫిబ్రవరి 21: చరిత్రలో ఈరోజు

1894: శాస్త్రవేత్త శాంతి స్వరూప్ భట్నాగర్ జననం (ఫొటోలో)
1941: ఇన్సులిన్ సహ ఆవిష్కర్త ఫ్రెడరిక్ బాంటింగ్ మరణం
1961: భారత సంతతికి చెందిన అమెరికన్ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత అభిజిత్ బెనర్జీ జననం
1976: సినీ గాయకుడు విజయ ప్రకాశ్ జననం
1977: సినీ గాయకుడు రంజిత్ జననం
1988: నటి వేదిక జననం
2013: దిల్‌సుఖ్ నగర్‌లో బాంబు పేలుళ్లు.. 18 మంది మృతి
* అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం