News April 16, 2025

ALERT.. నోటిఫికేషన్ విడుదల

image

AP: 2025-26 విద్యా సంవత్సరానికి అన్ని ప్రైవేట్ అన్‌ ఎయిడెడ్ స్కూళ్లలో పేద, బలహీన వర్గాల పిల్లలకు 1వ క్లాసులో 25% సీట్లు కేటాయించేందుకు ప్రభుత్వం <>నోటిఫికేషన్<<>> ఇచ్చింది. 5 సంవత్సరాలు నిండిన వారు ఈ నెల 28వ తేదీ నుంచి మే 15వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పిస్తే, ప్రభుత్వం సీట్లు కేటాయిస్తుంది. ఇందుకోసం తల్లిదండ్రుల ఆధార్/ఓటర్/రేషన్/జాబ్ కార్డు/ విద్యుత్ బిల్లు, DOB పత్రం ఉండాలి. ఇతర వివరాలకు 18004258599కు ఫోన్ చేయండి.

Similar News

News December 9, 2025

కేజీ నిమ్మ రూ.6.. రైతుల గగ్గోలు

image

AP: రాష్ట్రంలో నిమ్మకాయ ధరలు భారీగా పడిపోవడంతో రైతులు కుదేలవుతున్నారు. నెల్లూరు జిల్లా గూడూరు, పొదలకూరు, నంద్యాల జిల్లాలోని నిమ్మ మార్కెట్‌లలో 80 కేజీల బస్తా రకాన్ని బట్టి రూ.500 నుంచి రూ.1,000 మాత్రమే పలుకుతోంది. కిలోకు రూ.6-12 మాత్రమే వస్తుండటంతో తీవ్రంగా నష్టపోతున్నామని అన్నదాతలు వాపోతున్నారు. గతేడాది ఇదే సమయంలో కేజీ రూ.40 వరకు పలికిందని చెబుతున్నారు.

News December 9, 2025

ఫీటల్ బ్రాడీకార్డియా గురించి తెలుసా?

image

ప్రెగ్నెన్సీలో పిండం కనీసం 7 మిల్లీమీటర్ల పొడవు ఉన్నప్పుడు డాక్టర్ సాధారణంగా బిడ్డ గుండె చప్పుడుని వినగలరని నిపుణులు చెబుతున్నారు. దీనిని గుర్తించలేకపోతే మరో వారంలో మరో స్కాన్ తీస్తారు. ఫీటల్ బ్రాడీకార్డియా ఉన్నప్పుడు గుండె కండరాలకి సిగ్నల్ ఆలస్యంగా ఉండడం, గుండె వ్యవస్థలో సమస్య, గుండె పై, కింది గదుల మధ్య సమస్య ఏర్పడతాయి. ఇలాంటప్పుడు తల్లి పరిస్థితిని బట్టి డాక్టర్స్ సరైన ట్రీట్‌మెంట్‌ని ఇస్తారు.

News December 9, 2025

సినిమా వాయిదా..! దర్శకుడి ఎమోషనల్ పోస్ట్

image

‘మోగ్లీ’ రిలీజ్ వాయిదా అంటూ ప్రచారం నడుమ డైరెక్టర్ సందీప్ రాజ్ ఎమోషనల్ ట్వీట్ చేశారు. ‘అంతా సర్దుకుందనుకుంటున్న టైంలో మోగ్లీ చిత్ర విడుదలకు బ్యాడ్ లక్ ఎదురవుతోంది. డైరెక్టర్ సందీప్ రాజ్ అనే టైటిల్‌ను బిగ్ స్క్రీన్‌పై చూడాలనుకున్న కల రోజురోజుకూ కష్టమవుతోంది. వెండితెరకు నేను ఇష్టం లేదేమో. అంకితభావంతో పనిచేసిన రోషన్, సరోజ్, సాక్షి వంటి వారికోసమైనా అంతా మంచి జరగాలని ఆశిస్తున్నా’ అని పేర్కొన్నారు.