News October 8, 2025
ALERT: ప్రవేశాలకు రెండు రోజులే గడువు

TG: అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 2025-26 విద్యాసంవత్సరానికి గాను అడ్మిషన్లకు దరఖాస్తు గడువు అక్టోబర్ 10తో ముగియనుంది. బీఏ, బీకాం, బీఎస్సీలో చేరేందుకు ఇంటర్మీడియట్ లేదా ఓపెన్ ఇంటర్, పాలిటెక్నిక్, ఐటీఐ ఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులు. ప్రవేశాల కోసం www.braouonline.inలో అప్లై చేసుకోవచ్చు. విద్యార్థులకు రిటైల్ రంగంలో ఉపాధి కల్పించడానికి RASCI సంస్థతో యూనివర్సిటీ ఒప్పందం చేసుకుంది.
Similar News
News October 8, 2025
రేపు ఉదయం 10.30 గంటలకు..

TG: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి మొదటి విడత ఎన్నికల నోటిఫికేషన్ రేపు 10.30AMకు విడుదల చేయాలని SEC రాణి కుముదిని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. నోటిఫికేషన్‌తో పాటు ఓటరు జాబితా వివరాలను ప్రచురించాలన్నారు. OCT 9-11 వరకు ప్రతిరోజు ఉ.10:30 నుంచి సా.5 గంటల వరకు <<17863320>>నామినేషన్లను<<>> స్వీకరించాలని పేర్కొన్నారు. ఇందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
News October 8, 2025
యూనివర్సిటీలకు వీసీల నియామకం

AP: రాష్ట్రంలోని ఐదు యూనివర్సిటీలకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ వైస్ ఛాన్స్‌లర్‌లను నియమించారు.
* ఆచార్య నాగార్జున- వెంకట సత్యనారాయణ రాజు
* శ్రీ వెంకటేశ్వర- టాటా నర్సింగరావు
* వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్, ఫైన్ ఆర్ట్స్- బి.జయరామి రెడ్డి
* జేఎన్‌టీయూ(విజయనగరం)- వి.వెంకట సుబ్బారావు
* యోగి వేమన (కడప)- రాజశేఖర్ బెల్లంకొండ
News October 8, 2025
విద్యా సంస్థల సమ్మె వాయిదా

TG: ఈనెల 13 నుంచి సమ్మెకు దిగుతామన్న ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య కాస్త వెనక్కి తగ్గింది. CMతో చర్చిస్తామని ప్రభుత్వ సలహాదారు నరేందర్ రెడ్డి హామీ ఇవ్వడంతో సమాఖ్య ప్రతినిధులు సమ్మెను వాయిదా వేశారు. దీపావళిలోగా రూ.300 కోట్ల బకాయిలు విడుదల చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. దీంతో OCT 13 నుంచి ప్రారంభం కావాల్సిన సమ్మె, కళాశాలల బంద్ కార్యక్రమాన్ని OCT 23కు వాయిదా వేయాలని నిర్ణయించారు.