News November 4, 2024
ALERT.. పాస్‌వర్డ్‌లు మార్చట్లేదా?

ఆర్థిక మోసాలు, సైబర్ నేరాల బారిన పడకూడదంటే మొబైల్/ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌లను ప్రతీ 3 లేదా 6 నెలలకోసారి మార్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పాస్‌వర్డ్‌లను ఎవరికీ చెప్పొద్దని, ఒకవేళ చెప్పాల్సి వస్తే ఆ తర్వాత వెంటనే మార్చుకోవాలని అంటున్నారు. మీకు సంబంధించిన స్పెషల్ తేదీలు, రకరకాల సింబల్స్, ఎక్కువ అక్షరాలు(కనీసం 16) ఉండేలా, క్లిష్టతరమైన పాస్‌వర్డ్‌లను పెట్టుకుంటే మంచిదని చెబుతున్నారు.
Similar News
News December 23, 2025
భారత్‌లో చిక్కుకున్న ‘H1-B’లకు ఇదొక్కటే మార్గమా?

US వీసా ఇంటర్వ్యూలు 2026 వరకు వాయిదా పడటంతో భారత్‌లో చిక్కుకున్న వాళ్లకు ‘ఎమర్జెన్సీ అపాయింట్‌మెంట్’ ఆశగా మారింది. <<18568186>>వెట్టింగ్<<>> నిబంధనల వల్ల ఎంబసీలు ఈ అభ్యర్థనల పట్ల కూడా కఠినంగా వ్యవహరిస్తున్నాయి. వైద్య అత్యవసరాలు, ఉద్యోగం కోల్పోవడం లేదా కంపెనీకి భారీ నష్టం వంటి బలమైన కారణాలు ఉండి, ఆధారాలు సమర్పిస్తేనే వీటిని మంజూరు చేస్తున్నాయి. ఒకసారి అభ్యర్థనను తిరస్కరిస్తే మళ్లీ ఛాన్స్ ఉండదు.
News December 23, 2025
రైతు దినోత్సవం: దివంగత ప్రధాని చరణ్ సింగ్ గురించి తెలుసా?

* ఉత్తర భారతంలో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వ ఏర్పాటు
* జమీందారీ వ్యవస్థ రద్దు, రైతులకు భూపంపిణీలో కీలక పాత్ర
* ప్రధాని అయిన రెండో ఉప ప్రధాని
* ప్రధాని హోదాలో 23 రోజులు మాత్రమే
* పార్లమెంటును ఫేస్ చేయని ఏకైక ప్రధాని
* కనీస మద్దతు ధరకు పునాదులు వేసిన వ్యక్తి
* మరణానంతరం 2024లో భారతరత్న ప్రదానం
* ఈరోజు (Dec 23) ఆయన జయంతిని ఏటా రైతుల దినోత్సవంగా నిర్వహిస్తారు.
News December 23, 2025
బాంబులతో చెక్ డ్యామ్‌లను పేల్చేస్తున్నారు.. ఇదే సాక్ష్యం: కేటీఆర్

TG: ఇసుక మాఫియా కోసం బాంబులతో చెక్ డ్యామ్‌లను పేల్చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ‘ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వాటర్ మ్యాన్ రాజేంద్ర సింగ్ గారు “ఇది మానవ నిర్మిత విధ్వంసం” అని మొత్తుకుంటున్నా, ఈ “చిట్టి నాయుడి” ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదు. డ్రిల్లింగ్ మెషీన్లతో హోల్స్ చేసి, జిలెటిన్ స్టిక్స్ పెట్టి పేల్చారని ఆయన సాక్ష్యాలతో సహా నిరూపించారు’ అని Xలో ఫైరయ్యారు.


