News July 12, 2024
ALERT.. కాసేపట్లో ఈ జిల్లాల్లో వర్షం

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మరికాసేపట్లో వర్షం కురుస్తుందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్, ఆదిలాబాద్, జగిత్యాల, జనగామ, గద్వాల్, కామారెడ్డి, ఖమ్మం, ఆసిఫాబాద్, నాగర్కర్నూల్, నల్గొండ, నారాయణపేట్, నిర్మల్, నిజామాబాద్, సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వనపర్తి, వికారాబాద్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
Similar News
News November 22, 2025
క్షమాపణలు చెప్పిన అల్-ఫలాహ్ వర్సిటీ

ఢిల్లీ పేలుడు ఘటనలో అల్-ఫలాహ్ వర్సిటీ పేరు రావడంతో, వారి వెబ్సైట్లో ఉన్న పాత అక్రిడిటేషన్ వివరాలపై NAAC షోకాజ్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై వర్సిటీ స్పందిస్తూ వెబ్సైట్ డిజైన్ లోపాలు కారణంగా ఈ పొరపాట్లు జరిగాయని క్షమాపణలు తెలిపింది. తప్పుడు సమాచారాన్ని తొలగించినట్లు పేర్కొంది. కాగా గడువు ముగిసిన తరువాత కూడా వర్సిటీ గ్రేడ్లను తమ సైట్లో కొనసాగిస్తూ వచ్చింది.
News November 22, 2025
జల, వాయు మార్గాల ద్వారా భారత్-అఫ్గాన్ ట్రేడ్

భారత్-అఫ్గాన్ మధ్య సంబంధాలు బలోపేతమవుతున్నాయి. పాక్ రోడ్డు మార్గం మూసేయడంతో జల, వాయు మార్గాల ద్వారా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని విస్తరించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇందుకోసం ఇరాన్లోని చాబహార్ ఓడరేవుతోపాటు రెండు ప్రత్యేక కార్గో విమానాలను ఉపయోగించుకోనున్నట్లు ఇరు దేశాలు ప్రకటించాయి. ప్రస్తుతం IND-AFG మధ్య బిలియన్ డాలర్ల వాణిజ్యం జరుగుతుండగా, భవిష్యత్తులో మరింత పెంచనున్నాయి.
News November 22, 2025
పత్తి రైతుకు దక్కని మద్దతు ధర

మద్దతు ధర విషయంలో పత్తి రైతులకు కష్టాలు తప్పడం లేదు. క్వింటా పత్తి పొట్టి పింజ రూ.7,710, పొడవు పింజ రూ.8110 మద్దతు ధరగా ప్రకటించినా.. నిబంధనల వల్ల ఆ ధర దక్కే పరిస్థితి కనిపించడం లేదు. తేమ ఉందని, రంగు మారిందని కొనుగోలు కేంద్రాల్లో తక్కువ ధరే ఇస్తున్నారు. గ్రామాల్లో కొందరు వ్యాపారులు క్వింటా పత్తిని రూ.5వేలు నుంచి రూ.6వేలకే అడుగుతున్నారు. దీంతో తమకు పెట్టుబడి కూడా దక్కట్లేదని రైతులు వాపోతున్నారు.


