News July 26, 2024

ALERT.. కాసేపట్లో ఈ జిల్లాల్లో వర్షం

image

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మరో 3 గంటల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట్, కరీంనగర్, హనుమకొండ, జనగామ, వరంగల్, మహబూబాబాద్, నాగర్‌కర్నూల్, వనపర్తిలో వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. 40కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది.

Similar News

News December 3, 2025

సమ్మిట్‌కు రావాలని కాంగ్రెస్ పెద్దలకు ఆహ్వానం

image

ఈనెల 8, 9 తేదీలలో హైదరాబాద్‌లో జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్- 2025కు హాజరుకావాలని కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీని కోరినట్లు పెద్దపల్లి MP వంశీకృష్ణ తెలిపారు. CM రేవంత్ రెడ్డి, డిప్యూటీ CM భట్టి విక్రమార్క, MPలతో కలిసి ఢిల్లీ వెళ్లిన వంశీకృష్ణ బుధవారం రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని ఆహ్వానించారు. రాష్ట్రంలోని మౌలిక వసతులు, పెట్టుబడి అవకాశాలు, అభివృద్ధి ప్రాధాన్యతపై చర్చించారు.

News December 3, 2025

ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్లు పెట్టాలి: CBN

image

AP: వ్యవసాయోత్పత్తులు గ్లోబల్ బ్రాండ్‌గా మారాలని తూ.గో.జిల్లా నల్లజర్లలో ‘రైతన్నా.. మీకోసం’ కార్యక్రమంలో CM చంద్రబాబు ఆకాంక్షించారు. ‘ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్లు పెట్టుకోవాలి. ఫ్యాక్టరీలు, మార్కెట్‌తో అనుసంధానమవ్వాలి. ఏ పంటలతో ఆదాయమొస్తుంది? ఏ కాంబినేషన్ పంటలు వేయాలి? పరిశ్రమలకు అనుసంధానం ఎలా చేయాలి? రైతులే పరిశ్రమలు ఎలా పెట్టాలన్న అంశాలపై ప్రభుత్వం సహకరిస్తుంది’ అని తెలిపారు.

News December 3, 2025

మీక్కూడా ఫేవరెట్ కిడ్ ఉన్నారా?

image

చాలా కుటుంబాల్లో తెలియకుండానే ‘ఫేవరెట్‌ కిడ్‌’ ప్రభావం కనిపిస్తుందంటున్నారు నిపుణులు. తల్లిదండ్రుల ప్రేమలో తేడా లేకపోయినా.. చిన్నచిన్న సందర్భాల్లో ఈ పక్షపాతం బయట పడుతుంది. కొన్నిసార్లు ఒకరితో ఎక్కువ ఓపికగా, ఆప్యాయంగా ఉండటం చేస్తుంటారు. కొన్నిసార్లు ఇది తల్లిదండ్రులు కూడా గ్రహించకపోవచ్చు. తల్లిదండ్రులు తమను తక్కువగా చూస్తున్నారనే భావన పిల్లల్లో నెగెటివ్‌ ఆలోచనలను పెంచుతుందని చెబుతున్నారు.