News August 16, 2024
ALERT: రెండు గంటల్లో వర్షం

రానున్న రెండు గంటల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, సిరిసిల్ల, సంగారెడ్డి, సిద్దిపేట, ఆదిలాబాద్ జిల్లాల్లో మోస్తరు వాన పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. గంటకు 40కి.మీ మేర ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది.
Similar News
News December 19, 2025
నల్గొండ: జనవరి నుంచి HPV టీకాలు

మహిళల్లో వచ్చే క్యాన్సర్లను అరికట్టాలనే లక్ష్యంతో 14 నుంచి 15 ఏళ్ల లోపు బాలికలందరికీ హ్యూమన్ పాపిల్లోమా వైరస్ వ్యాక్సిన్ (HPV)ను వేయనున్నట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ పుట్ల శ్రీనివాస్ అన్నారు. HPV టీకాలపై డీఎంహెచ్ కార్యాలయంలో మెడికల్ ఆఫీసర్లు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ టీకాలను 2026 జనవరి నుంచి అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఇస్తామన్నారు.
News December 19, 2025
రోజూ గుడ్లు పెట్టే కోళ్ల గురించి తెలుసా?

పౌల్ట్రీ పరిశ్రమలో అధిక గుడ్ల ఉత్పత్తికి ప్రసిద్ధి చెందాయి BV 380 రకం కోళ్లు. ఇవి వేడి, తేమ వాతావరణాలకు అనుకూలంగా ఉంటాయి. సంవత్సరానికి 308 గుడ్లు పెట్టడం ఈ కోళ్ల ప్రత్యేకత. BV 380 కోడి పిల్లలను 18 నుంచి 20 వారాల పాటు పెంచిన తర్వాత గుడ్లను పెట్టడం ప్రారంభిస్తాయి. గోధుమ రంగులో ఉండే ఈ గుడ్లు పెద్దగా ఉంటాయి. ఇవి ఏడాది పాటు గుడ్లు పెట్టి తర్వాత ఆపేస్తాయి. అప్పుడు వాటిని మాంసం కోసం విక్రయించవచ్చు.
News December 19, 2025
సర్పంచ్ అభ్యర్థికి ఒక్క ఓటూ పడలేదు!

TG: మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో ఆశ్చర్యకర ఘటన జరిగింది. సర్పంచ్ బరిలో నిలిచిన ఓ అభ్యర్థికి ఒక్క ఓటూ రాలేదు. వరంగల్(D) ఖానాపురం(M) కీర్యాతండాలో ఈ నెల 17న సర్పంచ్ ఎన్నికల పోలింగ్ జరిగింది. మొత్తం 239 ఓట్లు పోలవగా BJP బలపరిచిన బోడ గౌతమికి కనీసం ఒక్క ఓటు కూడా పడలేదు. చివరికి నోటాకు ఒక ఓటు పోలైంది. దీంతో ఆమె తనకు తానూ ఓటు వేసుకోలేదా? అని అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇక్కడ INC అభ్యర్థి విజయ గెలిచారు.


