News April 15, 2025
ALERT.. కాసేపట్లో వర్షం

తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న 3 గంటల్లో వర్షం పడుతుందని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదిలాబాద్, భూపాలపల్లి, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి, నిజామాబాద్ జిల్లాల్లో అర్ధరాత్రి ఒంటిగంట వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. వీటితో పాటు గంటకు 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఎల్లో అలర్ట్ జారీచేసింది.
Similar News
News April 16, 2025
బాలీవుడ్లోకి ధోనీ ఎంట్రీ?

బాలీవుడ్ ప్రొడ్యూసర్, డైరెక్టర్ కరణ్ జోహార్ చేసిన ఓ పోస్టుతో క్రికెటర్ <
News April 16, 2025
GREAT: ఆ రెండు ఘనతలూ పంజాబ్వే..

IPL-2025: KKRతో జరిగిన లోస్కోరింగ్ మ్యాచ్లో <<16112256>>PBKS<<>> అనూహ్య విజయం సాధించిన విషయం తెలిసిందే. 112 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్కతాను 95 పరుగులకే కట్టడి చేసింది. IPLలో ఇంత తక్కువ స్కోరు(111)ను కాపాడుకోవడం ఇదే తొలిసారి. కాగా, ఇదే పంజాబ్ 2024 సీజన్లో KKRపై 262 పరుగుల లక్ష్యాన్ని 18.4 ఓవర్లలోనే ఛేదించింది. ఆ మ్యాచ్లో బెయిర్స్టో సెంచరీతో చెలరేగారు. ఆ గేమ్ మీకు గుర్తుంటే COMMENT చేయండి.
News April 16, 2025
పోలీసుల పనితీరులో దేశంలోనే తెలంగాణ టాప్

పోలీసు విభాగం పనితీరుకు సంబంధించి ఇండియా జస్టిస్ రిపోర్ట్-2025 ప్రకారం తెలంగాణ 6.48 పాయింట్లతో దేశంలోనే తొలిస్థానంలో నిలిచింది. ఈ కేటగిరిలో 6.44Pతో ఏపీ రెండో స్థానం, 6.19Pతో కర్ణాటక మూడో స్థానాన్ని సొంతం చేసుకున్నాయి. ఇదే విభాగంలో ప.బెంగాల్ చిట్టచివర నిలిచింది. జ్యుడీషియల్ ర్యాంకింగ్లో TGకి 2వ, APకి 5వ స్థానాలు దక్కాయి. అలాగే, ప్రిజన్స్ విభాగంలో ఏపీ 4వ, టీజీ 7వ స్థానంలో నిలిచాయి.