News July 20, 2024
ALERT.. కాసేపట్లో వర్షం

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మరో 2 గంటల్లో వర్షం కురుస్తుందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్, భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మెదక్, మల్కాజ్గిరి, నల్గొండ, నిజామాబాద్, సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, వరంగల్, హన్మకొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
Similar News
News January 10, 2026
సంక్రాంతి వేళ బస్సుల్లో ఛార్జీలు పెంచారా.. ఈ నంబర్ గుర్తుంచుకోండి!

AP: సంక్రాంతి నేపథ్యంలో కొన్ని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు విపరీతంగా ఛార్జీలు పెంచినట్లు ఫిర్యాదులు రావడంతో రవాణాశాఖ చర్యలకు ఉపక్రమించింది. ఆర్టీసీ ఛార్జీల కంటే 50% మించి వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న ట్రావెల్స్పై ఫిర్యాదుకు చేసేందుకు టోల్ ఫ్రీ నంబరు(92816 07001)ను సంప్రదించాలంది. 18వ తేదీ వరకు ట్రావెల్స్ బస్సుల్లో తనిఖీలు చేస్తామని పేర్కొంది.
News January 10, 2026
‘భూ భారతి’ ఛార్జీల చెల్లింపు అక్రమాలపై విచారణకు ఆదేశం

TG: ‘భూ భారతి’ రిజిస్ట్రేషన్ ఛార్జీల చెల్లింపులో <<18804858>>అక్రమాలపై<<>> లోకాయుక్త సుమోటోగా కేసు నమోదు చేసి విచారణకు ఆదేశించింది. సమగ్ర నివేదిక సమర్పించాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ, రెవెన్యూ&భూ పరిపాలన శాఖ అధికారులకు నిర్దేశించింది. ఈ స్కామ్లో యాదగిరిగుట్టకు చెందిన ఓ మీ సేవ నిర్వాహకుడే ప్రధాన సూత్రధారి అని తెలుస్తోంది. పోర్టల్కు నకిలీ ప్రింటర్ యాప్ను జోడించి తప్పుడు రశీదులు సృష్టించినట్లు సమాచారం.
News January 10, 2026
764 పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

DRDOకు చెందిన సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్మెంట్(CEPTAM)లో 764 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి డిప్లొమా, BSc, BLSc, MLSc, టెన్త్, ITI అర్హత కలిగినవారు అర్హులు. వయసు 18-28 ఏళ్లు ఉండాలి. రిజర్వేషన్ బట్టి ఏజ్ సడలింపు ఉంటుంది. టైర్1, టైర్ 2 రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: www.drdo.gov.in *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీ వెళ్లండి.


