News August 21, 2024

ALERT: కాసేపట్లో వర్షం

image

హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో మరో గంటలో వర్షం కురిసే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, కామారెడ్డి, కరీంనగర్, ఆసిఫాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, సిరిసిల్ల, RR, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో వాన పడే ఛాన్స్ ఉందని పేర్కొంది.

Similar News

News January 12, 2026

చర్మాన్ని ఇలా హైడ్రేట్ చెయ్యండి..

image

కాలం ఏదైనా చర్మం ఆరోగ్యంగా, తాజాగా కనిపించడానికి తేమ కావాలి. వయసు పైబడటం, ఎండ వేడికి చర్మం పాడవడం వల్ల చర్మ కణాల్లో నీటిశాతం తగ్గిపోతుంది. కాబట్టి చర్మానికి హైడ్రేటర్లను అందించాలి. మాయిశ్చరైజర్లతో పోలిస్తే హైడ్రేటర్లు కణాల మధ్య నీటిని పట్టి ఉంచడంలో సాయపడతాయి. గ్లిజరిన్, హ్యాలురోనిక్ ఆసిడ్ వంటివి హైడ్రేటర్లు. వాటిని తప్పక వాడాలి. వీటితో పాటు వారానికి రెండుసార్లు స్క్రబింగ్ చేయడం అలవాటు చేసుకోవాలి.

News January 12, 2026

కోల్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

కోల్ ఇండియా లిమిటెడ్‌(<>CIL<<>>)లో 125 ఇండస్ట్రీయల్ ట్రైనీ పోస్టులకు అప్లై చేయడానికి ఇంకా మూడు రోజులే(JAN 15) సమయం ఉంది. ఉద్యోగాన్ని బట్టి CA/CMA ఉత్తీర్ణులు అర్హులు. అభ్యర్థుల గరిష్ట వయసు 28 ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. విద్యార్హతల్లో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ట్రైనింగ్ సమయంలో నెలకు రూ.22వేలు స్టైపెండ్ చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.coalindia.in/

News January 12, 2026

పనసలో కాయకుళ్లు తెగులు లక్షణాలు

image

పనసలో కాయకుళ్లు తెగులు ప్రధానంగా బూజు తెగులు వల్ల వస్తుంది. ఇది పూత, పిందె దశలో మొదలై కాయకు వ్యాపిస్తుంది. ఈ తెగులు ఆశించడం వల్ల తొలుత మగ పువ్వులు, పూత, పిందెలు కుళ్లిపోతాయి. తర్వాత ఎదిగే కాయలు నల్లగా మారి కుళ్లిపోతాయి. ముఖ్యంగా జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఈ తెగులు ఉద్ధృతి ఎక్కువగా కనిపిస్తుంది. దీన్ని సకాలంలో గుర్తించి నివారణ చర్యలు చేపట్టకుంటే దిగుబడి బాగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది.