News September 6, 2024

ALERT: కాసేపట్లో వర్షం

image

రాత్రి 7 గంటల వరకు తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షం కురవనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ జిల్లాలు ఇవే.. కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, ఆదిలాబాద్, హైదరాబాద్, ఆసిఫాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, ములుగు, నాగర్‌కర్నూల్, నల్గొండ, రంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, వనపర్తి, యాదాద్రి-భువనగిరి.

Similar News

News January 8, 2026

గ్రోక్ వివాదం.. కేంద్రానికి ‘X’ నివేదిక

image

‘X’లో <<18744769>>అశ్లీల కంటెంట్<<>> అంశం కేంద్రానికి చేరిన విషయం తెలిసిందే. అలాంటి కంటెంట్‌ను తొలగించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అదే విధంగా నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. తాజాగా బుధవారం సాయంత్రానికి ఎక్స్ తన రిపోర్టును సమర్పించింది. దీనిని ఐటీ శాఖ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. Grokను దుర్వినియోగం చేసే యూజర్లపై కఠిన చర్యలు తప్పవని ఇప్పటికే సదరు సంస్థ హెచ్చరించింది.

News January 8, 2026

ఏంటి తమ్ముడూ ఈ ఆట.. ఇంకా పెంచుతావా: అశ్విన్

image

14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ గత కొన్ని నెలలుగా <<18788014>>సంచలన ప్రదర్శన<<>> చేస్తున్నారు. దీనిపై మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసల వర్షం కురిపించారు. గత 30 రోజుల్లో దేశీయ, U-19 క్రికెట్‌లో వైభవ్ సాధించిన 171, 190, 108*, 127 వంటి భారీ స్కోర్లను Xలో షేర్ చేశారు. “ఏంటి తమ్ముడూ ఈ ఆట? ఇంకా పెంచుతావా?” అంటూ తమిళంలో కామెంట్స్ చేశారు. ఇంత చిన్న వయసులో ఇంతటి భారీ స్కోర్లు చేయడం అద్భుతమని కొనియాడారు.

News January 8, 2026

జనవరి 8: చరిత్రలో ఈరోజు

image

* 1642: ప్రముఖ భౌగోళిక శాస్త్రజ్ఞుడు గెలీలియో మరణం. * 1942: భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ జననం * 1962: లియోనార్డో డావిన్సీ వేసిన ‘మోనాలిసా’ పెయింటింగ్‌ను USలో తొలిసారి ప్రదర్శించారు. * 1975: మ్యూజిక్ డైరెక్టర్ హ్యారిస్ జైరాజ్ పుట్టినరోజు * 1983: హీరో తరుణ్ బర్త్‌డే (ఫొటోలో) * 1987: IND మాజీ క్రికెటర్ నానా జోషి మరణం