News December 23, 2024
ALERT.. 3 రోజులు వర్షాలు

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న మూడ్రోజులు దక్షిణ కోస్తాలో వర్షాలు పడనున్నాయి. నెల్లూరు, ప్రకాశం, తిరుపతి సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. పోర్టుల్లో మూడో నంబర్ హెచ్చరికలు కొనసాగుతున్నాయి. మత్స్యకారులు గురువారం వరకు సముద్రంలో వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు.
Similar News
News October 23, 2025
సముద్ర మట్టం పెరిగితే 282 గ్రామాలు ముంపు

AP: దేశంలో తుఫాన్లు, వరదలు వంటి విపరీత వాతావరణ పరిస్థితులు ఎదురయ్యే ప్రాంతాల్లో ఏపీ ఒకటి. వీటివల్ల ఏటా ప్రాణ, ఆస్తి నష్టమూ ఎక్కువే. సముద్ర మట్టం పెరుగుదలతో రానున్నకాలంలో ఏపీలోని 282 తీర గ్రామాలు ముంపుబారిన పడొచ్చని తాజాగా అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో 10L మందిని తరలించాల్సి రావచ్చంటున్నారు. ఇప్పటికే 32% తీరప్రాంతం కోతకు గురవుతున్నట్లు గుర్తించిన GOVT దీన్ని ఎదుర్కోవడానికి చర్యలు చేపడుతోంది.
News October 23, 2025
చిన్నారులకు నాన్వెజ్ ఎప్పుడు పెట్టాలంటే?

పిల్లల ఎదుగుదలలో ఆహారం కీలకపాత్ర పోషిస్తోంది. ఆరునెలల నుంచి పిల్లలకు నెమ్మదిగా ఘనాహారం అలవాటు చెయ్యాలని నిపుణులు సూచిస్తున్నారు. 8నెలల నుంచి మాంసాహారం ఇవ్వాలి. ముందుగా ఉడికించిన గుడ్డును, సంవత్సరం దాటిన తర్వాత చికెన్, చేపలు పెట్టాలి. వాటిని బాగా ఉడికించి మెత్తగా చేసి పిల్లలకు పెట్టాలని చెబుతున్నారు. మాంసాహారంలో ఐరన్, జింక్ పుష్కలంగా ఉంటాయి కాబట్టి వాటిని పిల్లలకు అలవాటు చెయ్యాలంటున్నారు.
News October 23, 2025
స్వదేశీ సత్తా.. ట్రాకింగ్లో ‘రియా’ అద్భుతం!

ప్రధాని మోదీ ఇచ్చిన స్వదేశీ నినాద స్ఫూర్తితో BSF శిక్షణ ఇచ్చిన స్వదేశీ జాతి శునకాలు సత్తా చాటాయి. టేకాన్పూర్ నేషనల్ ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ పొందిన ‘రియా’ అనే భారతీయ శునకం 116 విదేశీ జాతులను అధిగమించింది. ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్లో ‘రియా’ ఏకంగా ‘బెస్ట్ ట్రాకర్ ట్రేడ్ డాగ్’ & ‘డాగ్ ఆఫ్ ది మీట్’ అనే రెండు టైటిల్స్ను గెలుచుకుంది. ఈ ఘనత సాధించిన తొలి స్వదేశీ శునకం ఇదే కావడం విశేషం.