News August 4, 2024

ALERT.. 5 రోజులు వర్షాలు

image

తెలంగాణలో రానున్న 5 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న 3 రోజుల్లో గంటకు 30-40కి.మీ వేగంతో స్థిరమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. వర్షాలకు సంబంధించి వాతావరణ శాఖ ఎలాంటి ఆరెంజ్, రెడ్ అలర్ట్‌లు జారీ చేయలేదు.

Similar News

News November 27, 2025

ధన్వాడ కేజీబీవీ ఎస్ఓ తొలగింపు

image

ధన్వాడ కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (కేజీబీవీ) స్పెషల్ ఆఫీసర్ (ఎస్ఓ) జి.గంగమ్మను విధుల నుంచి తొలగిస్తూ డీఈఓ గోవిందరాజు బుధవారం ఆదేశాలు జారీ చేశారు. అవినీతి, రిజిస్టర్ల లోపాలు, నిధుల దుర్వినియోగం, మెస్ నియామకాల్లో నిర్లక్ష్యం వంటి ఫిర్యాదులపై కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ చర్య తీసుకున్నారు.

News November 27, 2025

వారికి నిద్ర అవసరం: సుందర్ పిచాయ్

image

‘జెమిని 3’ మోడల్‌ కోసం తన బృందం కొన్ని వారాల పాటు విరామం లేకుండా పని చేసిందని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తెలిపారు. ‘ఉద్యోగులంతా ఎంతో అలసిపోయారు. కొందరికి నిద్ర అవసరం. ఇప్పుడు తగిన విశ్రాంతి దొరుకుతుందని ఆశిస్తున్నా’ అని చెప్పారు. ‘గూగుల్ ఏఐ: రిలీజ్ నోట్స్’ పాడ్‌కాస్ట్‌లో ఆయన మాట్లాడారు. జెమిని 3 ఏఐ మోడల్‌ను ఇటీవల గూగుల్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.

News November 27, 2025

నిర్మాతలను బ్లేమ్ చేయొద్దు: SKN

image

కంఫర్ట్ కోసం ఎక్కువ ఖర్చు చేస్తూ ప్రొడ్యూసర్స్‌‌ను బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదని ప్రేక్షకులనుద్దేశించి నిర్మాత SKN పేర్కొన్నారు. ‘మనం కంఫర్ట్, లగ్జరీ కావాలి అనుకున్నప్పుడే ఎక్కువ పే చేయాలి. కేవలం కంఫర్ట్ కోసమే ఎక్స్‌ట్రా చెల్లిస్తున్నాం. లగ్జరీ థియేటర్లో చూడాలంటే రియల్‌ఎస్టేట్ వాల్యూ ప్రకారం టికెట్, రిఫ్రెష్‌మెంట్ రేట్లుంటాయి. వాటితో నిర్మాతకొచ్చే ఎక్స్‌ట్రా బెనిఫిట్ ఏమీ ఉండదు’ అని తెలిపారు.