News April 6, 2025
ALERT: మరో 5 రోజులు వర్షాలు

AP: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మరో 5 రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవాళ, రేపు కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశముందని తెలిపింది. నేడు ఉత్తరాంధ్రలో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు, కాకినాడ జిల్లాలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు పడతాయని APSDMA ఓ ప్రకటనలో అంచనా వేసింది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2-4 డిగ్రీలు పెరుగుతాయని పేర్కొంది.
Similar News
News November 18, 2025
శబరిమల భక్తులకు అలర్ట్

శబరిమల యాత్రికులు పంబా నదిలో స్నానం చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని కేరళ ఆరోగ్య శాఖ అధికారులు హెచ్చరించారు. ముక్కు ద్వారా నీరు లోపలికి వెళ్తే ప్రమాదకర అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ (బ్రెయిన్ ఫీవర్) వ్యాధి సోకే ప్రమాదం ఉందని తెలిపారు. వ్యాధి ప్రారంభంలో తీవ్రమైన తలనొప్పి, జ్వరం, వాంతులు, మెడ బిగుసుకుపోవడం వంటి లక్షణాలు ఉంటాయన్నారు. నదిలో మునిగేటప్పుడు ముక్కు మూసుకోవాలని సూచించారు.

ఎనామలీ స్కాన్ ఎందుకంటే?

ప్రెగ్నెన్సీలో 20వారాల తర్వాత ఎనామలీ స్కాన్ చేయించాలని వైద్యులు సూచిస్తారు. మీ గర్భంలో పెరుగుతున్న బేబీ అవయవాల ఆకృతిని ఈ పరీక్ష విశ్లేషిస్తుంది. క్లెఫ్ట్ లిప్(పెదాల చీలిక), స్పైనా బైఫైడా (వెన్నుముక సరైన ఆకృతికి రాకపోవడం), ఎడ్వర్డ్ సిండ్రోమ్ (అదనపు క్రోమోజోమ్స్ ఉండడం), కంజెషనల్ హార్ట్ డిసీజ్(CHD) వంటివి ఇందులో తెలుస్తాయి. అంతర్గత అవయవాల ఎదుగుదలను కూడా పరిశీలిస్తారు. కాబట్టి ఈ టెస్ట్ తప్పనిసరి.