News October 1, 2024
ALERT.. కాసేపట్లో ఈ ప్రాంతాల్లో వర్షాలు

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రానున్న 3 గంటల్లో వర్షాలు పడతాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. జగిత్యాల, జనగామ, గద్వాల్, కరీంనగర్, మెదక్, నాగర్కర్నూల్, నల్గొండ, సిరిసిల్ల, సంగారెడ్డి, వికారాబాద్, వరంగల్, హన్మకొండ, భువనగిరి సహా మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయంది. అటు హైదరాబాద్ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో రెండు గంటలుగా భారీ వర్షం కురుస్తోంది.
Similar News
News November 19, 2025
BOBలో 82 పోస్టులకు నోటిఫికేషన్

బ్యాంక్ ఆఫ్ బరోడా(<
News November 19, 2025
గజ్వేల్: లెక్చరర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

గజ్వల్ మైనారిటీ గురుకుల కళాశాలలో ఖాళీగా ఉన్న పీజీటీ-ఫిజిక్స్, పీజీటీ-మాథ్స్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా మైనారిటీ సంక్షేమాధికారి నాగరాజమ్మ తెలిపారు. దరఖాస్తులను గజ్వేల్ కళాశాలలో ఈ నెల 19 నుంచి 24వ తేదీ వరకు అందివ్వాలన్నారు. మహిళ అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలన్నారు. పోస్టులను ఔట్ సోర్సింగ్ పద్దతిలో భర్తీ చేస్తామన్నారు.
News November 19, 2025
అఖండ పల్నాడు రారాజు అనుగు రాజు యాదవ్ గురించి తెలుసా..?

పల్నాడు చరిత్ర అనగానే బ్రహ్మనాయుడు, నాగమ్మ గుర్తుకొస్తారు. అయితే అఖండ పల్నాడును పరిపాలించిన అనుగురాజు యాదవ్ పాత్ర కీలకమైనది. ఈయనకు ఇద్దరు భార్యలు. పెద్ద భార్య కుమారుడు మలిదేవుడు మాచర్ల రాజధానిగా బ్రహ్మనాయుడు మంత్రిగా, చిన్న భార్య కుమారుడు నలగామ రాజు గురజాల రాజధానిగా నాగమ్మ మంత్రిగా పరిపాలించారు. దాయాదుల మధ్య జరిగిందే పల్నాటి యుద్ధం అనుగరాజ గుర్తుగా పిడుగురాళ్లలో ఆయన విగ్రహం ఏర్పాటు చేశారు.


