News November 17, 2024

ALERT: ఈ జిల్లాల్లో వర్షాలు

image

AP: నైరుతి బంగాళాఖాతం నుంచి కొమరిన్ తీరం వరకు ద్రోణి విస్తరించింది. అలాగే బంగాళాఖాతం నుంచి రాయలసీమ, కోస్తా వైపు తూర్పుగాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో నేడు వర్షాలు కురుస్తాయని APSDMA వెల్లడించింది. మరోవైపు రాష్ట్రంలో చలి పెరుగుతోంది. నిన్న కళింగపట్నంలో 20.6డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.

Similar News

News November 28, 2025

నల్గొండ: సోషల్‌ మీడియాపై ఎస్పీ ప్రత్యేక నిఘా

image

గ్రామ పంచాయతీ ఎన్నికల వేళ సోషల్‌ మీడియా కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ శరత్‌ చంద్ర పవార్ తెలిపారు. ​సోషల్‌ మీడియా వేదికగా ఎవరైనా అసత్య ప్రచారం చేసినా, లేక ప్రత్యర్థులపై దుష్ప్రచారం చేసి శాంతి భద్రతలకు భంగం కలిగించాలని చూసినా, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. ఈ విషయంలో పోలీసులు ఏమాత్రం ఉపేక్షించబోరని ఆయన స్పష్టం చేశారు.

News November 28, 2025

రోజుకు 30-35 లీటర్ల పాలు.. ఈ ఆవులతో డెయిరీఫామ్ మేలు

image

ప్రపంచంలోనే అత్యధికంగా పాలిచ్చే ఆవు జాతుల్లో హోలిస్టిన్ ఫ్రీజియన్ ఒకటి. వివిధ వాతావరణ పరిస్థితులను తట్టుకొని ఒక ఈతలో 9వేల లీటర్లకు పైగా పాలు ఇస్తాయి. ఇవి రోజుకు కనీసం 25-30 లీటర్లు, కొన్ని సందర్భాల్లో 35-40 లీటర్ల వరకు పాలు ఇస్తాయి. పాలలో కొవ్వు 3.5%గా, ప్రొటీన్ 3.1%గా ఉంటుంది. ఈ రకం ఆవులతో డెయిరీఫామ్ నిర్వహణ మేలంటున్నారు వెటర్నరీ నిపుణులు. మరింత సమాచారానికి <<-se_10015>>పాడిపంట <<>>క్లిక్ చేయండి.

News November 28, 2025

అవసరమైతే కోర్టులో మూలన నిలబెట్టగలం.. రంగనాథ్‌పై HC తీవ్ర ఆగ్రహం

image

TG: అంబర్‌పేట బతుకమ్మ కుంట వ్యవహారంలో విచారణకు హాజరుకాకపోవడంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై HC ఆగ్రహించింది. న్యాయస్థానం ఉత్తర్వులపై గౌరవం లేదా అని ప్రశ్నించింది. అవసరమైతే ఉ.10.30 గంటల నుంచి సా.4.30 గంటల వరకు కోర్టులో ఓ మూలన నిలబెడతామని ఘాటు వ్యాఖ్యలు చేసింది. బతుకమ్మ కుంట భూవివాదం కొనసాగుతుండగానే పనులు చేపట్టారంటూ కోర్టు ధిక్కరణ పిటిషన్‌‌పై విచారణ సందర్భంగా ఈ కామెంట్స్ చేసింది.